Pawan Kalyan : క్రిష్ సినిమా షూటింగ్ కు 20 రోజులు బ్రేక్ ఇవ్వనున్న పవన్.. ఈ గ్యాప్ లో..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో వకీల్ సాబ్ గా థియేటర్స్ లో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ రికార్డులను క్రియేట్ చేస్తుంది

Pawan Kalyan : క్రిష్ సినిమా షూటింగ్ కు 20 రోజులు బ్రేక్ ఇవ్వనున్న పవన్.. ఈ గ్యాప్ లో..

Updated on: Jan 20, 2021 | 12:07 AM

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో వకీల్ సాబ్ గా థియేటర్స్ లో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ రికార్డులను క్రియేట్ చేస్తుంది. ఇదిలా ఉంటే మరో వైపు క్రిష్ సినిమాను కూడా పట్టాలెక్కించేసాడు పవన్. ఇప్పటికే చక చక షూటింగ్ కూడా జరుపుకుంటుంది ఈ సినిమా అయితే ఈ సినిమా షూటింగ్ కు కొద్ది రోజులు బ్రేక్ ఇవ్వనున్నారట.

ప్రస్తుతం హైదరాబాద్ లోనే షూటింగ్ కొనసాగుతోంది. వచ్చే గురువారంతో ఈ షెడ్యూల్ పూర్తి కానుంది. ఆతర్వాత షెడ్యూల్ లో రెండు పాటలను ప్లాన్ చేస్తున్నారట. ఈ షూటింగ్ నైట్ ఎఫెక్ట్ లో జరగనునందని తెలుస్తుంది. ఈ షెడ్యూల్ పూర్తికాగానే .. సుమారు 20 రోజులపాటు షూటింగ్ కు బ్రేక్ ఇవ్వబోతున్నాడట క్రిష్. ఈ గ్యాప్ లో పవన్ ఇంకో సినిమాను చేస్తారా.. లేక రాజకీయాల్లో బిజీ అవుతారా అన్నది తెలియాల్సి ఉంది. ఇక పవన్ క్రిష్ సినిమాతో పాటు, రానాతో కలిసి నటిస్తున్న మలయాళం సినిమా ‘అయ్యపనమ్ కోషియం’ రీమేక్ లో నటిస్తున్నారు. మరో వైపు పవన్ తో సినిమా కోసం హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి కథలతో సిద్ధంగా ఉన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Tollywood Hero: టాలీవుడ్ యంగ్ హీరోపై కేసు నమోదు.. కార్లు ఇప్పిస్తానంటూ మోసానికి..!

ఆసుపత్రిలో చేరిన ‘ఆర్ఆర్ఆర్’ బ్యూటీ.. ఆ సినిమా షూటింగ్‏లో ఉండగానే.. అసలు కారణం ఏంటంటే ?