Rana And Miheeka : ‘రానా-మిహీక’ల గోల్డెన్ క్లే 3డి స్ట్రక్చర్..సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ దగ్గుబాటి రానా గత ఏడాది ఓ ఇంటివాడైన విషయం తెలిసిందే. ఆగష్టు 8న జరిగిన వివాహ వేడుకలో తన ప్రేయసి మిహికా బజాజ్

Rana And Miheeka : 'రానా-మిహీక'ల గోల్డెన్ క్లే 3డి స్ట్రక్చర్..సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో
Follow us

|

Updated on: Jan 20, 2021 | 5:43 AM

Rana And Miheeka : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ దగ్గుబాటి రానా గత ఏడాది ఓ ఇంటివాడైన విషయం తెలిసిందే. ఆగష్టు 8న జరిగిన వివాహ వేడుకలో తన ప్రేయసి మిహీక బజాజ్ ని మూడు ముళ్ల బంధంతో ముడివేసుకున్నాడు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఇరు కుటుంబ సభ్యులు అతి కొద్దిమంది అతిథులు సన్నిహితుల మధ్య రానా – మిహీక వివాహం వైభవంగా జరిగింది. ఇక ఇప్పుడు రానా సినిమాలతో బిజీ అయిపోయాడు. ఇదిలా ఉంటే  హ్యాండ్ ఇంప్రెషన్ ఆర్టిస్ట్ భావన రానా మిహీకల గురించి సోషల్ మీడియాలో తాజాగా పోస్ట్ చేసింది.

ఈ పోస్ట్ లో రానా మిహీకల గోల్డెన్ క్లే 3డి స్ట్రక్చర్ ఫోటో పోస్ట్ చేసింది. ఈ మధ్యే రానా మిహీక తమ హ్యాండ్ ఇంప్రెషన్స్(అరచేతి ముద్రలను) గోల్డెన్ క్లే 3డి స్ట్రక్చర్ కోసం హ్యాండ్ ఇంప్రెషన్ ఆర్టిస్ట్ కు ఇచ్చారట. ఇందుకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆర్టిస్ట్ భావన “మేం హ్యాండ్ ఇంప్రెషన్స్ కోసం రానా మిహీకను కలిసినప్పుడు వారిద్దరిని చూసినప్పుడు మెడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించింది. అలాగే మేం చేతి ముద్రలను తీసుకునే సమయంలో మాస్కులు ధరించాం. కానీ మేం కళ్లతో వారి ఆనందాన్ని చూసాం’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆర్టిస్ట్ భావన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Pawan Kalyan : క్రిష్ సినిమా షూటింగ్ కు 20 రోజులు బ్రేక్ ఇవ్వనున్న పవన్.. ఈ గ్యాప్ లో..