Ravi Teja Krack Movie : సాలిడ్ హిట్ కొట్టిన మాస్ రాజా.. ‘క్రాక్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎంతంటే..

మాస్ మహారాజ్ రవితేజ నటించిన మాస్ మసాలా ఎంటర్ టైనర్ క్రాక్ సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి సందడంతా..

Ravi Teja Krack Movie : సాలిడ్ హిట్ కొట్టిన మాస్ రాజా.. క్రాక్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎంతంటే..

Updated on: Jan 17, 2021 | 4:20 PM

Ravi Teja Krack Movie : మాస్ మహారాజ్ రవితేజ నటించిన మాస్ మసాలా ఎంటర్ టైనర్ ‘క్రాక్’ సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి సందడంతా రవితేజలోనే కనిపించింది. ఈ సినిమాతో చాలా కాలం తర్వాత సాలిడ్ హిట్ ను అందుకున్నాడు మాస్ రాజా. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో మాస్ మహారాజా ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్.. శ్రుతిహాసన్ గ్లామర్ రొమాంటిక్ సాంగ్స్ అన్నీ మాస్ కి బాగా కనెక్టయ్యాయి. మలినేని గోపీచంద్ ఈ సినిమాతో రవితేజతో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు. ఇక ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది.

మొదటినుంచి ఈ సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. కరోనా లాక్ డౌన్ తర్వాత విడుదలై సంచలన విజయం సాధించిన సినిమా ఇదే. క్రాక్ కలక్షన్ల పరంగా దూసుకుపోతుంది. ఈ సినిమా తొలి వారమే రికార్డ్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో 21. 50 కోట్లు షేర్ వసూలు చేసింది. గ్రాస్ దాదాపు 38 కోట్ల వరకు ఉంది. మాస్ క్లాస్ అనే తేడా లేకుండా జనం కరోనా భయాల్ని వదిలి థియేటర్లకు వస్తుండడంతో ఇప్పుడు క్రాక్ కి థియేటర్ల సంఖ్య పెంచాలని కూడా నిర్మాతలు భావిస్తున్నారట..

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ram Gopal Varma: సర్కార్ సిరీస్‌లో మరో సినిమా… క్లారిటీ ఇచ్చేసిన ఆర్జీవీ.. కుండబద్దలు కొట్టేశారుగా..!

Alludu Adhurs : అదరగొడుతున్న ‘అల్లుడు అదుర్స్’.. బ్రేక్ ఈవెన్ సాదించిందన్న బెల్లంకొండ సురేష్