Ghani Movie: ఫ్యాన్స్‌కు గని నుంచి స్పెషల్‌ ట్రీట్‌.. తమన్న స్టెప్పులకు ఫిదా అవుతోన్న కుర్రకారు..

Ghani Movie: వరుణ్‌ తేజ్‌ (Varun Tej) హీరోగా తెరకెక్కిన సినిమా 'గని'. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సుమారు రూ. 35 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే విడదల కావాల్సి ఉండగా, కరోనా కారణంగా పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది...

Ghani Movie: ఫ్యాన్స్‌కు గని నుంచి స్పెషల్‌ ట్రీట్‌.. తమన్న స్టెప్పులకు ఫిదా అవుతోన్న కుర్రకారు..

Updated on: Mar 24, 2022 | 12:06 PM

Ghani Movie: వరుణ్‌ తేజ్‌ (Varun Tej) హీరోగా తెరకెక్కిన సినిమా ‘గని’. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సుమారు రూ. 35 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే విడదల కావాల్సి ఉండగా, కరోనా కారణంగా పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. గతంలో మార్చి 4న విడుదల చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. అయితే తాజాగా ఏప్రిల్‌ 8న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో సినిమా తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచింది.

ఇందులో భాగంగా ఇటీవల సినిమా ట్రైలర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా విడుదల చేసిన తమన్నా ప్రధాన పాత్రలో నటించిన ‘కొడితే’ అనే స్పెషల్‌ సాంగ్ లిరికల్‌ వీడియోకు భారీగా రెస్పాన్స్‌ వచ్చిన నేపథ్యంలో చిత్ర యూనిట్‌ తాజాగా ఫుల్‌ వీడియో సాంగ్‌ను విడుదల చేసింది. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్‌ అట్రాక్టివ్‌గా ఉండగా, తమన్‌ మ్యూజిక్‌తో అదరగొట్టాడు. ఇక తమన్నా డ్యాన్స్‌తో కుర్రకారును ఫిదా చేసింది. హాట్‌ లుక్స్‌లో అదరగొట్టింది మిల్కీ బ్యూటీ. ఇక ఈ సినిమాలో జగపతిబాబు, ఉపేంద్ర, నవీన్‌ చంద్ర, సునీల్‌శెట్టి తదితరులు కీలక పాత్రలో నటించారు.

Also Read: Amritha aiyer: పట్టుపరికిణిలో మెరిసే చందమామలా ఒంపు సొంపులతో అమృత అయ్యర్…(ఫొటోస్)

Stock Market: నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. టాప్ లూజర్‌గా నిలిచిన కోటక్ మహీంద్రా బ్యాంక్..

Green chilli price: ఎండు మిర్చి మాత్రమే కాదు.. పచ్చి మిర్చి కూడా దుమ్ములేపుతుంది.. కేజీ ఎంతో తెలుసా..?