‘గరుడవేగ’ డైరెక్టర్‏తో నాగార్జున కొత్త సినిమా షూరు.. క్లాప్ కొట్టి స్టార్ట్ చేసిన తెలంగాణ మంత్రి తలసాని..

అక్కినేని నాగార్జున మరో ప్రాజెక్టును మంగళవారం ప్రారంభించారు. PSV గరుడవేగ ఫేం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగ్ ఓ సినిమా చేయబోతున్నారనే సంగతి తెలిసిందే.

గరుడవేగ డైరెక్టర్‏తో నాగార్జున కొత్త సినిమా షూరు.. క్లాప్ కొట్టి స్టార్ట్ చేసిన తెలంగాణ మంత్రి తలసాని..

Updated on: Feb 16, 2021 | 4:23 PM

అక్కినేని నాగార్జున మరో ప్రాజెక్టును మంగళవారం ప్రారంభించారు. PSV గరుడవేగ ఫేం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగ్ ఓ సినిమా చేయబోతున్నారనే సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి బ్యానర్లపై నారాయణ దాస్ కె నాంరగ్, రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాని మంగళవారం సికింద్రాబాద్‏లోని గణపతి దేవాలయంలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ఈ మూవీ ముహూర్తపు సన్నివేశానికి తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ క్లాప్ ఇచ్చి యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఇదిలా ఉండగా.. లాక్‏డౌన్ తర్వాత నాగ్ స్పీడ్ పెంచారు. గతేడాది ప్రారంభమై.. కరోనా ప్రభావంతో వాయిదా పడిన సినిమా షూటింగ్‏ను వెంట వెంటనే పూర్తిచేశారు. అందులో వైల్డ్ డాగ్, బ్రహ్మస్త సినిమాలు కూడా ఉన్నాయి. ఇక ఈ మూవీలో నాగార్జునను సరికొత్త యాంగిల్‏లో చూపించేందుకు ప్రవీణ్ సత్తారు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో నాగార్జున ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్ టైనర్‏లో నటించనున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. “నిన్ననే బ్రహ్మాస్త్ర మూవీ షూటింగ్ పూర్తిచేసుకున్నాను. ఈరోజు శ్రీగణపతి దేవాలయంలో సినిమా ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఇంకా టైటిల్ ఫైనలైజ్ కాలేదు. యాక్షన్ బ్యాక్‏డ్రాప్‏లో ఇలాంటి పవర్ ఫుల్ క్యారెక్టర్లో నటించి చాలా రోజులైంది. హైదరాబాద్‏తోపాటు విదేశాల్లో కూడా ఈ మూవీ షూటింగ్ జరగునుంది” అని తెలిపారు.

Also Read:

Radhe Shyam : రాధేశ్యామ్ లో సరికొత్త లుక్ లో ప్రభాస్.. కాస్ట్యూమ్ ఖర్చుతెలిస్తే షాక్ అవ్వాల్సిందే..ఏకంగా….