Kiccha Sudeep: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు కన్నడ స్టార్ కిచ్చా సుదీప్. ఆ సినిమాలో నెగెటివ్ పాత్రలో నటించి మెప్పించాడు సుదీప్. ఆతర్వాత బాహుబలి, సైరా సినిమాల్లోనూ నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ఇవే కాదు కన్నడ డబ్ సినిమాలతోనూ మెప్పిస్తోన్న ఈ స్టార్ హీరో ఇప్పుడు పాన్ ఇండియా చిత్రంతో మన ముందుకు వస్తున్నాడు. అదే విక్రాంత్ రోణ (Vikrant Rona). అనూప్ భండారీ దర్శకత్వం వహిస్తోన్న ఈ అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్‌లో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez) సుదీప్‌తో స్ర్కీన్ షేర్ చేసుకోనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఎట్టకేలకు సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు దర్శక నిర్మాతలు. జూలై 28న కన్నడతో సహా మొత్తం నాలుగు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా రిలీజ్ డేట్ టీజర్ పేరుతో ఓ వీడియోను కూడా విడుదల చేశారు మూవీ మేకర్స్.
కాగా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని విక్రాంత్ రోణ విడుదల తేదీ టీజర్‌ను తెలుగులో చిరంజీవి, హిందీలో సల్మాన్ ఖాన్, మలయాళంలో మోహన్ లాల్, తమిళంలో శింబు విడుదల చేశారు. చిన్నపిల్లల సంభాషణలతో ఆసక్తిగా ప్రారంభమైన ఈ టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా టీజర్ చివరిలో వచ్చే సుదీప్ లుక్ సూపర్బ్‌గా ఉంది. కాగా ఈ సినిమాను కూడా 3Dలో కూడా విడుదల చేయనున్నారు నిర్మాతలు జాన్ మంజునాథ్, శాలిని మంజునాథ్. సుదీప్ కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అజనీశ్ లోక్‌నాథ్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు.
This looks Superb! @KicchaSudeep ‘s adventure-thriller release date teaser లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. Director @anupsbhandari & entire team, BEST WISHES!#VikrantRonaJuly28 worldwide release in 3D @nirupbhandari @neethaofficial @Asli_Jacqueline @shaliniartss @ZeeStudios_ pic.twitter.com/L6affNJf14
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 2, 2022
Also Read:Ugadi Celebrations: తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ఉగాది వేడుకలు.. పాల్గొన్న సీఎం దంపతులు
Diabetes Diet: మీకు డయాబెటిస్ ఉందా..? అయితే మీ ఆహారంలో ఈ పండును చేర్చుకోండి..