కేజీఎఫ్ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. ఈ సినిమా ద్వారా కన్నడ సూపర్ స్టార్ యశ్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు. ఈ సినిమా కన్నడ, తెలుగ, తమిళ భాషల్లో రిలీజై రికార్డులు క్రియేట్ చేసింది. బంగారు గనుల నేపథ్యంలో సాగే స్టోరీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. రాకీ భాయ్‌గా యశ్ యూత్‌ను బాగా అట్రాక్ట్ చేశాడు.
అయితే ఈ సినిమాకు సీక్వెల్‌గా కేజీఎఫ్ చాప్టర్ 2 సిద్దమవుతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోనే జరుగుతుంది. ఇటీవలే దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రముఖ స్టంట్స్ మాస్టర్స్ సారధ్యంలో భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ షెడ్యూల్ లో యష్ మరియు సంజయ్ దత్ లు పాల్గొంటున్నారు. వీరిద్దరి మద్య జరిగే ఫైటింగ్ సన్నివేశం సినిమాకే హైలైట్ ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతున్నారు. విజువల్ వండర్ గా ఉండటంతో పాటు చాలా రియాల్టీగా ఉండేలా ప్లాన్ చేశాడట డైరెక్టర్. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నేటి వరకు సంజయ్ దత్ పై కీలక షాట్స్ షూట్ చేసి రేపటి నుంచి అసలు పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తామని చిత్ర యూనిట్ ప్రకటించారు. డిసెంబర్ మూడవ వారం వరకు సినిమా షూటింగ్ పూర్తిచేైసి సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని తెలిపారు.