AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘లోకనాయకుడు’తో జత కట్టబోతున్న ‘మహానటి’..!

ఓ వైపు యంగ్‌ హీరోలతో జత కడుతూనే మరోవైపు సీనియర్‌ హీరోలను చుట్టేస్తోంది 'మహానటి' కీర్తి సురేష్‌. ఈ క్రమంలో ఇప్పటికే రజనీకాంత్ 'అన్నాత్తే'లో, మోహన్ లాల్‌ 'మరాక్కర్'‌ మూవీల్లో కీలక పాత్రల్లో నటిస్తోంది కీర్తి.

'లోకనాయకుడు'తో జత కట్టబోతున్న 'మహానటి'..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 20, 2020 | 10:09 AM

Share

ఓ వైపు యంగ్‌ హీరోలతో జత కడుతూనే మరోవైపు సీనియర్‌ హీరోలను చుట్టేస్తోంది ‘మహానటి’ కీర్తి సురేష్‌. ఈ క్రమంలో ఇప్పటికే రజనీకాంత్ ‘అన్నాత్తే’లో, మోహన్ లాల్‌ ‘మరాక్కర్’‌ మూవీల్లో కీలక పాత్రల్లో నటిస్తోంది కీర్తి. తెలుగులో నాగార్జున ‘మన్మథుడు 2’లోనూ అతిథి పాత్రలో మెరిసింది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ బ్యూటీ లోక నాయకుడు కమల్‌ హాసన్‌తో జత కట్టబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ మీనన్‌, కమల్‌ హాసన్‌తో ‘వట్టైయాడు విలయాడు’ సీక్వెల్‌ను తెరకెక్కించాలనుకుంటున్నారు.

ఇందులో మొదట హీరోయిన్‌గా అనుష్క పేరు వినిపించింది. కానీ తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఆ స్థానాన్ని కీర్తి రీప్లేస్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో ‘ఇండియన్ 2’లో నటిస్తున్నారు కమల్ హాసన్. ఈ మూవీ తరువాత ‘తలైవాన్‌ ఇరుక్కిన్‌రన్’‌లో నటించనున్నారు. అలాగే రజనీకాంత్‌ నటిస్తోన్న ‘తలైవార్‌ 169’లోనూ కమల్ అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్‌. మరోవైపు కీర్తి సురేష్‌ తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తున్నారు.

Follow Us
దీపావళికి బంగారం కొంటున్నారా? ఈ తప్పు చేస్తే వేలల్లో నష్టం!
దీపావళికి బంగారం కొంటున్నారా? ఈ తప్పు చేస్తే వేలల్లో నష్టం!
ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా? మీ ఆరోగ్యానికి ముప్పు
ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా? మీ ఆరోగ్యానికి ముప్పు
ది ప్యారడైజ్‌ ఆ స్టార్ నటుడు కూడా ఉన్నడా.!!
ది ప్యారడైజ్‌ ఆ స్టార్ నటుడు కూడా ఉన్నడా.!!
ఆసిఫాబాద్‌ కలెక్టరేట్‌లో వృద్దదంపతుల ఆత్మహత్యాయత్నం
ఆసిఫాబాద్‌ కలెక్టరేట్‌లో వృద్దదంపతుల ఆత్మహత్యాయత్నం
ఆముదం ఆకుల సీక్రెట్స్ తెలిస్తే షాక్ అవుతారు..అద్భుత ఔషధ గుణాలుఇవే
ఆముదం ఆకుల సీక్రెట్స్ తెలిస్తే షాక్ అవుతారు..అద్భుత ఔషధ గుణాలుఇవే
పరగడుపున నెయ్యి, తులసి రసం తీసుకుంటే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!
పరగడుపున నెయ్యి, తులసి రసం తీసుకుంటే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!
హైదరాబాద్‌‌లో సీన్‌ ఛేంజ్‌.. కాంగ్రెస్‌ వ్యూహాత్మక అడుగులు..
హైదరాబాద్‌‌లో సీన్‌ ఛేంజ్‌.. కాంగ్రెస్‌ వ్యూహాత్మక అడుగులు..
తొలిరోజే హీటెక్కిన గొడవలు.. గాయాలతో ముగిసిన టాస్క్
తొలిరోజే హీటెక్కిన గొడవలు.. గాయాలతో ముగిసిన టాస్క్
బ్లడ్ షుగర్,అరికాళ్ల మంటలకు చెక్ పెట్టే అమృతం! మెంతుల కాంబినేషన్
బ్లడ్ షుగర్,అరికాళ్ల మంటలకు చెక్ పెట్టే అమృతం! మెంతుల కాంబినేషన్
చెడ్డీగ్యాంగ్‌ కలకలం.. అపార్ట్‌మెంట్, విల్లా కమిటీలకు కీలక సూచనలు
చెడ్డీగ్యాంగ్‌ కలకలం.. అపార్ట్‌మెంట్, విల్లా కమిటీలకు కీలక సూచనలు