Keerthy New Look: సర్కార్ వారిపాట కోసం సరికొత్త లుక్‌లో మహానటి.. ఏం మార్పు జరిగిందో తెలుసా..

|

Jan 15, 2021 | 2:00 PM

Keerthy New Look: మహానటితో స్టార్‌డమ్ సంపాదించి టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌గా కొనసాగుతోంది అందాల భామ కీర్తి సురేశ్.

Keerthy New Look: సర్కార్ వారిపాట కోసం సరికొత్త లుక్‌లో మహానటి.. ఏం మార్పు జరిగిందో తెలుసా..
Follow us on

Keerthy New Look: మహానటితో స్టార్‌డమ్ సంపాదించి టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌గా కొనసాగుతోంది అందాల భామ కీర్తి సురేశ్. పక్కింటి అమ్మాయిలా నటిస్తూ తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. వరుసగా సినిమా అవకాశాలు దక్కించుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అంతేకాకుండా బడా హీరోలతో నటిస్తూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుంది.

ప‌ర‌శురాం దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న సర్కార్ వారి పాట సినిమాలో కీర్తి హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమా గురించి కీర్తి చాలా హార్డ్‌వర్క్ చేస్తోంది. మ‌హానటి కోసం బ‌రువు పెరిగిన ఈ అమ్మడు ఆ త‌ర్వాత మ‌ళ్లీ సైజ్ జీరో లుక్ లోకి మారిపోయింది. తాజాగా స‌ర్కారు వారి పాట కోసం మ‌రో 10 కిలోలు బరువు పెరిగిన‌ట్టు టాక్ వినిపిస్తోంది. తాజాగా కీర్తిసురేశ్ లైట్ గోల్డెన్ క‌ల‌ర్ శారీ లుక్‌లో క‌నిపిస్తూ ఫొటోషూట్‌లో పాల్గొంది. ఈ కొత్త లుక్ మ‌హేశ్‌బాబు కోసమేనా అంటూ అందరు తెగ గుస‌గుస‌లాడుకుంటున్నారు. ఇప్పుడు ఈ లైట్ గోల్డెన్ క‌ల‌ర్ శారీ ఫొటోలు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఓటీటీ లో కీర్తిసురేష్ మొదటి సినిమా.. ఎన్నాళ్లకెన్నాళ్లకో ..

నితిన్ పై మహానటి పగ… ఎందుకో తెలుసా… ఇన్ స్టాలో పోస్టు… గుణపాఠం నేర్చుకున్నానన్న కీర్తి సురేష్…