‘బంగార్రాజు’తో మహానటి..?

|

Jun 23, 2019 | 7:52 AM

అక్కినేని నాగార్జున, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన చిత్రం ‘సోగ్గాడే చిన్నినాయనా’. 2016 సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇక ఈ సినిమాకి సీక్వెల్‌గా “బంగార్రాజు” అనే టైటిల్‌తో ఓ మూవీని కళ్యాణ్ కృష్ణ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమాలో నాగ చైతన్య కూడా ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నాడని టాక్. ఇకపోతే తాజా సమాచారం ప్రకారం ఈ […]

బంగార్రాజుతో మహానటి..?
Follow us on

అక్కినేని నాగార్జున, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన చిత్రం ‘సోగ్గాడే చిన్నినాయనా’. 2016 సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇక ఈ సినిమాకి సీక్వెల్‌గా “బంగార్రాజు” అనే టైటిల్‌తో ఓ మూవీని కళ్యాణ్ కృష్ణ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమాలో నాగ చైతన్య కూడా ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నాడని టాక్.

ఇకపోతే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో నాగ చైతన్య సరసన కీర్తి సురేష్‌ను ఎంపిక చేయాలని చూస్తోందట చిత్ర యూనిట్. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు ‘మన్మధుడు 2’ సినిమాలో కీర్తి సురేష్ ఓ గెస్ట్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆగష్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.