Kartik Aaryans: ఆ బాలీవుడ్ హీరో రెమ్యూనరేషన్ రోజుకు రెండు కోట్లంట? ఆయన ఎవరో తెలుసా..
Kartik Aaryans: బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ విభిన్న సినిమాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాడు. వెరైటీ సినిమాలు ప్లాన్ చేస్తూ యూత్‌కి
Kartik Aaryans: బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ విభిన్న సినిమాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాడు. వెరైటీ సినిమాలు ప్లాన్ చేస్తూ యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యాడు. యంగ్ హీరోలలో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. అయితే కార్తీక్ ఇప్పుడు సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. రామ్ మాధ్వానీ డైరెక్షన్‌లో వస్తున్న ‘ధమాకా’లో న్యూ అవతార్‌లో కనిపించబోతున్న ఆర్యన్ పది రోజుల్లోనే సినిమా పూర్తి చేసి షాకిచ్చాడు. అయితే టెన్ డేస్‌లో షూటింగ్ పూర్తి చేయడం వల్ల నిర్మాతలకు భాగా కలిసొచ్చింది. చాలా వరకు ఖర్చులను తప్పించాడు.
అయితే ఈ చిత్రం కోసం కార్తీక్ ఆర్యన్ రూ. 20కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంటే రోజుకు 2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడన్న మాట. నార్మల్ బడ్జెట్ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసేందుకు దాదాపు 45 రోజులు తీసుకుంటున్న సమయంలో ఆర్యన్ వన్ బై ఫోర్త్ టైమ్‌లో ప్రాజెక్ట్ పూర్తి చేసి, నిర్మాతలు ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా చూసుకున్నాడు. ఇప్పుడు ఈ విషయం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ముంబైలోని సబర్బన్ హోటల్‌లో ‘ధమాకా’ షూటింగ్ జరగ్గా ఫస్ట్ లుక్‌లో ఇంటెన్స్ అవతార్‌లో కనిపించారు కార్తీక్ ఆర్యన్. మృణాల్ ఠాకూర్ ఫిమేల్ లీడ్ చేస్తున్న ఈ సినిమా నీర్జా, ఆర్యల తర్వాత దర్శకుడు రామ్ మాధ్వానీ నుంచి వచ్చే మరో షాకింగ్ స్టోరీ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. సినిమా ఎలా ఉందో తెలియాలంటే మాత్రం కొన్ని రోజులు ఆగాల్సిందే.
ఈమె అందంతో కుర్రకారు షేక్, రెమ్యూనరేషన్‌తో ప్రొడ్యూసర్లు షాక్ !