టికెట్ ఇస్తే ఎమ్మెల్యేగా పోటీచేస్తా.. ఏపీ, తెలంగాణ ఎక్కడినుంచైనా సరే.. సంచలన కామెంట్లు చేసిన వంటలక్క

|

Jun 04, 2021 | 6:08 AM

ఇంటిల్లిపాది కూర్చొని కాలక్షేపం చేయడానికి టీవీ సీరియళ్లు చాలానే ఉన్నాయి. అయితే వీటిలో కార్తీక దీపం సీరియల్ కు విపరీతమైన క్రేజ్ ఉంది.

టికెట్ ఇస్తే ఎమ్మెల్యేగా పోటీచేస్తా.. ఏపీ, తెలంగాణ ఎక్కడినుంచైనా సరే.. సంచలన కామెంట్లు చేసిన వంటలక్క
Karthika deepam fame premi viswanath
Follow us on

Karthika Deepam: ఇంటిల్లిపాది కూర్చొని కాలక్షేపం చేయడానికి టీవీ సీరియళ్లు చాలానే ఉన్నాయి. అయితే వీటిలో కార్తీక దీపం సీరియల్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. చిన్న పెద్ద అందరు ఈ సీరియల్ కు ఫ్యాన్స్ అయిపోయారు. ఇక లాక్ డౌన్ పుణ్యమా అని ఈ సీరియల్ వ్యూయర్ షిప్ కూడా బాగానే పెరిగింది. ముఖ్యంగా ఈ సీరియల్ లో దీప అలియాస్ వంటలక్క కు ఫుల్లు పాపులారిటీ వచ్చింది. నలుగురు ఆడవాళ్ళు కలిసి మాట్లాడుకుంటున్నారంటే ఖచ్చితంగా అక్కడ కార్తీక దీపం వంటలక్క టాపిక్  ఉంటుంది. అయితే వంటలక్క పాత్ర పోస్తిస్తున్న ప్రేమీ విశ్వనాథ్ ఇప్పుడు రాజకీయాల్లో రాణించాలని చూస్తున్నారు.