Upendra: చిరంజీవితో సినిమా అందుకే చేయలేకపోయా.. అసలు విషయం చెప్పిన ఉపేంద్ర
ఉపేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘యూఐ’ సినిమా మరో రెండు రోజుల్లో విడుదల కానుంది. కన్నడతో పాటు తెలుగులోనూ ఈ సినిమా విడుదల కానుంది. ఉపేంద్రకు తెలుగులో విపరీతమైన అభిమానులున్నారు. చాలా ఏళ్ల క్రితమే ఉపేంద్ర తెలుగు మెగాస్టార్ చిరంజీవి కోసం ఒక సినిమాకి డైరెక్ట్ చేయాలనుకున్నారు.
కన్నడ నటుడు ఉపేంద్ర క్రేజ్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది . విభిన్నమైన కంటెంట్ తో సినిమాలు చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటారు ఉపేంద్ర. తెలుగులో ఆయనకు వీరాభిమానులు ఉన్నారు. కన్నడలో తెరకెక్కిన ఆయన సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి ప్రేక్షకులను మెప్పిస్తుంటాయి. ఇక ఇప్పుడు మరో వెరైటీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఉపేంద్ర. ఈ టాలెంటడ్ నటుడు కేవలం హీరో మాత్రమే కాదు దర్శకుడు కూడా.. ఆయన డైరెక్షన్ ను చాలా మంది మెచ్చుకున్నారు. నేటి యంగ్ దర్శకులకు ఆయన స్పూర్తి. ఉపేంద్ర దర్శకత్వం వహించిన ‘ఓం’, ‘ఉపేంద్ర’ వంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ‘యూఐ’ సినిమాతో మళ్లీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు. ముందుగా చిరంజీవి సినిమాకు ఉపేంద్ర దర్శకత్వం వహించాల్సి ఉంది. కానీ, అది సాధ్యం కాలేదు..
ఇది కూడా చదవండి : ఇదెక్కడి అరాచకం రా సామీ..! ఈ హాట్ బ్యూటీ.. 3 మూవీలో శ్రుతిహాసన్ చెల్లెలా..!!
రీసెంట్ గా ఉపేంద్ర హైదరాబాద్ కు వచ్చారు. యూఐ మూవీ ప్రమోషన్స్ లో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. ‘ఒక సినిమా కథతో చాలా సమయం గడిపాను. ఒక స్టార్ హీరో కోసం కథ రాయడానికి నాకు చాలా సమయం పట్టింది. అయితే నా రైటింగ్ ఆయన రేంజ్ లో లేదని నాకు అనిపించింది’ అని ఉపేంద్ర అన్నారు. అయితే సమయంలో స్టార్డమ్ అంటే ఏమిటో అర్థం అయ్యిందని తెలిపారు. ఆ హీరో ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. ఉపేంద్ర మాట్లాడుతూ.. “చిరంజీవి కోసం నేను కథను రాసుకున్నాను. ఎలాగైనా ఆయనను డైరెక్ట్ చేయాలి అనుకున్నాను. కానీ నా స్టోరీ ఆయన రేంజ్ లో లేదు. ఆయన మెగాస్టార్.. ఆయనకు సరిపోయే కథను నేను రెడీ చేయలేక పోయాను” అని అన్నారు ఉపేంద్ర.
ఇది కూడా చదవండి : Akhil: అయ్యగారికి జోడీ దొరికేసింది.. అఖిల్ నెస్ట్ సినిమాలో హీరోయిన్ ఈమెనట
అలాగే ఉప్పి 2 తర్వాత ఈ సినిమా చేయడానికి ఎనిమిదేళ్లు పట్టింది. ఈ సినిమా ప్రజల విజ్ఞతకు సవాల్‌గా ఉంటుందని ఉపేంద్ర అన్నారు. ఉపేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘యూఐ’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. కన్నడతో పాటు పలు భాషల్లో డిసెంబర్ 20న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా కథ 2040లో జరుగుతుంది. ఇది సైకలాజికల్ కల్కి అని ఉపేంద్ర అన్నారు. ఉపేంద్ర దర్శకత్వంతో పాటు ప్రధాన పాత్రలో కూడా నటిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.
ఇది కూడా చదవండి : బాబోయ్.. ఈ వయసులోనూ ఇలా ఉందేంటీ..!! సాహోలో నటించిన ఈ నటి గుర్తుందా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.