‘కేజిఎఫ్ 2’ రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

కన్నడ హీరో యష్ ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం ‘కేజిఎఫ్’. ఈ సినిమా గతేడాది విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం దీనికి కొనసాగింపుగా ‘కేజీఎఫ్ 2’ను తెరకెక్కిస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్  బెంగుళూరులో శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్ అనంతరం మైసూర్, రామోజీ ఫిల్మ్ సిటీ, బళ్లారి ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతుందట.  దీంతో 90 శాతం షూటింగ్ ముగుస్తుందని చిత్ర యూనిట్ చెబుతున్నారు.  పలువురు బాలీవుడ్ స్టార్స్ ఈ సినిమాలో ప్రధాన […]

కేజిఎఫ్ 2 రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

Updated on: May 13, 2019 | 9:50 PM

కన్నడ హీరో యష్ ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం ‘కేజిఎఫ్’. ఈ సినిమా గతేడాది విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం దీనికి కొనసాగింపుగా ‘కేజీఎఫ్ 2’ను తెరకెక్కిస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్  బెంగుళూరులో శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్ అనంతరం మైసూర్, రామోజీ ఫిల్మ్ సిటీ, బళ్లారి ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతుందట.  దీంతో 90 శాతం షూటింగ్ ముగుస్తుందని చిత్ర యూనిట్ చెబుతున్నారు.  పలువురు బాలీవుడ్ స్టార్స్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారని తెలుస్తోంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow Us