Kichcha Sudeep: మెల్‌బోర్న్‌లో కిచ్చా సుదీప్‌ దంపతులు.. ఇండియా-పాక్‌ మ్యాచ్‌ను వీక్షిస్తూ పెళ్లి రోజు వేడుకలు

|

Oct 24, 2022 | 7:58 AM

తమ వెడ్డింగ్‌ యానివర్సరీని పురస్కరించుకుని కిచ్చా సుదీప్, ప్రియ ఇటీవల ఆస్ట్రేలియా వెళ్లారు. సుదీప్‌కి క్రికెట్ అంటే చాలా ఇష్టం. అందులోనూ కోహ్లీ అంటే ప్రత్యేక అభిమానం. అతను మొదటి నుంచి విరాట్‌ ప్రాతినిథ్యం వహిస్తోన్న ఆర్‌సీబీకి మద్దతు ఇస్తున్నాడు.

Kichcha Sudeep: మెల్‌బోర్న్‌లో కిచ్చా సుదీప్‌ దంపతులు.. ఇండియా-పాక్‌ మ్యాచ్‌ను వీక్షిస్తూ పెళ్లి రోజు వేడుకలు
Kichcha Sudeep
Follow us on

కన్నడ సూపర్‌ స్టార్‌ కిచ్చా సుదీప్ సినిమాలు, బిగ్ బాస్ నుంచి కాస్త విరామం తీసుకున్నాడు. తన సతీమణితో కలిసి వివాహ వార్షికోత్సవాన్ని గ్రాండ్‌గా జరుపుకున్నాడు. ఇందుకోసం ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడే ఉండి మెల్‌బోర్న్‌ స్టేడియంలోనే భారత్-పాక్ జట్ల మధ్య జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‌ని వీక్షించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టీ-20 ప్రపంచకప్‌లో టీమిండియా చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. విరాట్ కోహ్లి అజేయంగా 82 పరుగులతో భారత్‌ గెలుపుతో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో అందరూ కోహ్లిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మ్యాచ్‌ను స్వయంగా వీక్షించిన సుదీప్ కూడా విరాట్‌ ఆటను మెచ్చుకున్నాడు. కాగా తమ వెడ్డింగ్‌ యానివర్సరీని పురస్కరించుకుని కిచ్చా సుదీప్, ప్రియ ఇటీవల ఆస్ట్రేలియా వెళ్లారు. సుదీప్‌కి క్రికెట్ అంటే చాలా ఇష్టం. అందులోనూ కోహ్లీ అంటే ప్రత్యేక అభిమానం. అతను మొదటి నుంచి విరాట్‌ ప్రాతినిథ్యం వహిస్తోన్న ఆర్‌సీబీకి మద్దతు ఇస్తున్నాడు. ఇందులో భాగంగానే ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌ను సుదీప్ వీక్షించాడు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు వైరల్‌గా మారాయి.

మ్యాచ్ అనంతరం ట్వీట్‌ చేసిన సుదీప్‌… ‘ఎక్కడ ఉన్నా కింగ్‌ కింగే. సెల్యూట్‌ కోహ్లీ. ఈ మ్యాచ్‌ను స్టేడియంలో ప్రత్యక్షంగా వీక్షించడం విశేషం. హార్దిక్ పాండ్యా, టీమ్ ఇండియాకు హ్యాట్సాఫ్’ అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చాడు. కాగా రక్త చరిత్ర సిరీస్‌ సినిమాలతో తెలుగు ఇండస్ట్రీకి మొదటిసారిగా పరిచయమయ్యాడీ హీరో. ఆ తర్వాత ఈగ, బాహుబలి, సైరా సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకుల అభిమానం సొంతం చేసుకున్నాడు. ఇటీవల విక్రాంత్‌ రోణ సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గాకూడా మారిపోయాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల  కోసం క్లిక్ చేయండి..