Sanchari Vijay: సినీ పరిశ్రమలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో యంగ్ హీరో బ్రెయిన్ డెడ్.. అవయవాలను దానం చేసిన..

|

Jun 14, 2021 | 2:40 PM

Sanchari Vijay:  సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు నటీనటులు మరణించగా.. తాజాగా ఎంతో భవిష్యత్తు ఉన్న యంగ్ హీరో హఠాత్తుగా మరణించారు.

Sanchari Vijay: సినీ పరిశ్రమలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో యంగ్ హీరో బ్రెయిన్ డెడ్.. అవయవాలను దానం చేసిన..
Sanchari Vijay
Follow us on

Sanchari Vijay:  సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు నటీనటులు మరణించగా.. తాజాగా ఎంతో భవిష్యత్తు ఉన్న యంగ్ హీరో హఠాత్తుగా మరణించారు. దీంతో కన్నడ సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాక్‍కు గురయ్యింది… జాతీయ అవార్డు గ్రహిత, ప్రముఖ కన్నడ నటుడు సంచారి విజయ్ కన్నుమూశారు. శనివారం రోడ్డు ప్రమాదానికి గురైన విజయ్ ను చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలోనే ఆయన పరిస్థితి విషమించడంతో.. సోమవారం (జూన్ 14న) మృతి చెందారు. విజయ్ బ్రెయిన్ డెడ్ అయ్యారని… వైద్యులు తెలిపారు. దీంతో ఆయన కుటుంబసభ్యులు విజయ్ అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన సోదరుడు సిద్ధేశ్ తెలిపారు. ఇదిలా ఉంటే.. స్టార్ హీరోలు సుదీప్, రాక్ స్టార్ యశ్ లతోపాటు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయన మృతికి సంతాపం తెలిపారు.

విజయ్ శనివారం (జూన్ 12) రాత్రి రేషన్ పంపిణి చేసేందుకు వెళ్లి.. తిరిగి తన స్నేహితులతో కలిసి బైక్ పై ఇంటికి వస్తుండగా.. వారి వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో విజయ్ తీవ్రంగా గాయపడడంతో ఆయన స్నేహితులు వెంటనే చెన్నైలోని ఆసుపత్రికి తరలించారు. తలకు తీవ్రగాయమవడంతో… విజయ్ బ్రెయిన్ డెడ్ అయ్యాడు. విజయ్.. 2011 లో రంగప్ప హోంగ్బిట్నా సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత హరివూ, ఒగ్గరానే సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత నాను అవనల్ల.. అవలు సినిమాకు జాతీయ అవార్డును అందుకున్నారు.

Also Read: ఈ కుర్రాడి తెలివి మాములుగా లేదుగా.. రైళ్లో సీటు కోసం ఏకంగా… యువకుడు చేసిన పనికి ప్రయాణికులు షాక్.. వీడియో వైరల్..

Coronavirus Second Wave: కరోనా మొదటి వేవ్ కంటె రెండో వేవ్ ఉధృతంగా వచ్చింది..అంతే వేగంగా అదుపులోకి వస్తోంది..

Viral Video: ఆకాశంలో అద్భుత దృశ్యం.. అల్లంత దూరంలో కనిపించిన ఎగిరేపళ్లెం.. వీడియో వైరల్‌!

Income Inequalities: కూడబెట్టిన సొమ్మును మహమ్మారి మింగేసింది.. ధనిక- పేదల మధ్య ఆర్థిక అంతరం పెరిగిందిః ఆర్‌బీఐ మాజీ గవర్నర్