సుశాంత్‌ ఆత్మహత్య కేసు.. కంగనాకు సమన్లు

బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో నటి కంగనా రనౌత్‌కు ముంబయి పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ విషయాన్ని కంగనా లాయర్ వెల్లడించారు.

సుశాంత్‌ ఆత్మహత్య కేసు.. కంగనాకు సమన్లు

Edited By:

Updated on: Jul 24, 2020 | 6:55 PM

బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో నటి కంగనా రనౌత్‌కు ముంబయి పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ విషయాన్ని కంగనా లాయర్ వెల్లడించారు. ప్రస్తుతం కంగనా మనాలీలో ఉండగా.. అక్కడికే వెళ్లి ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయాల్సిందిగా పోలీసులను కోరినట్లు నటి లాయర్ వెల్లడించారు.

కాగా సుశాంత్ మరణించినప్పటి నుంచి కంగనా రనౌత్‌ బాలీవుడ్‌లోని ప్రముఖులపై సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. బాలీవుడ్‌లో ఆదిత్య చోప్రా, కరణ్‌ జోహార్‌లు సుశాంత్‌ కెరీర్‌ను నాశనం చేశారని ఆమె ఆరోపించారు. అంతేకాదు పలు ఇంటర్వ్యూల్లో సైతం కంగనా, బాలీవుడ్‌ పెద్దలపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ విషయంలో ఏం మాట్లాడినా బహిరంగంగా మాట్లాడతానని, పారిపోయే మనిషిని కాదని స్పష్టం చేశారు. తన విమర్శలు నిరూపించుకోలేకపోతే పద్మశ్రీ అవార్డును కూడా వెనక్కి ఇచ్చేస్తానని ఆమె అన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ముంబయి పోలీసులు కంగనాకు సమన్లు జారీ చేశారు. కాగా గత నెల 14న సుశాంత్‌ ఆత్మహత్య చేసుకొని తనువు చాలించిన.. ఆయన కేసులో ఇప్పటివరకు 39 మందిని ప్రశ్నించారు. మరోవైపు ఈ కేసును సీబీఐకు అప్పగించాలంటూ ఫ్యాన్స్ నుంచి డిమాండ్ వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.