స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‏తో కమల్ హాసన్‏ సినిమా.. విలన్‏గా నటిస్తున్న మలయాళ నటుడు..

|

Dec 08, 2020 | 2:04 PM

క వైపు సినిమాలతోపాటు, తమిళ్ బిగ్‏బాస్ షోకి హోస్ట్‏గా వ్యవహరిస్తూ బిజీగా ఉంటున్నారు హీరో కమల్ హాసన్. కాగా ప్రస్తుతం కమల్ హీరోగా ఓ స‌క్సెస్‌ఫుల్

స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‏తో కమల్ హాసన్‏ సినిమా.. విలన్‏గా నటిస్తున్న మలయాళ నటుడు..
Follow us on

Kamal Haasan: ఒక వైపు సినిమాలతోపాటు, తమిళ్ బిగ్‏బాస్ షోకి హోస్ట్‏గా వ్యవహరిస్తూ బిజీగా ఉంటున్నారు హీరో కమల్ హాసన్. కాగా ప్రస్తుతం కమల్ హీరోగా ఓ స‌క్సెస్‌ఫుల్ డైరెక్టర్ తో  ‘విక్రమ్’ అనే సినిమాను చేస్తున్నాడు. నగరం, ఖైది చిత్రాలతో హిట్ డైరెక్టర్‏గా పేరు తెచ్చుకున్న లోకేశ్ కనకరాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అంతేగాక లోకేశ్ నిర్మించిన మరో చిత్రం ‘మాస్టర్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ టైటిల్ పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కమల్ నటిస్తున్న విక్రమ్ సినిమాలో విలన్‏గా మలయాళ నటుడు ఫాహిద్ ఫాజిల్‏ నటిస్తున్నట్లు సమచారం. కాగా ఫాహిద్ విలన్‏గా నటించడం కొత్తేమి కాకపోయినా కమల్ హాసన్ వంటి స్టార్ హీరోతో నటిస్తుండడం తనకు ఓ కొత్త అనుభవమే అంటా.