గురువుకు కాజల్ పుట్టినరోజు శుభాకాంక్షలు

‘లక్ష్మీ కల్యాణం’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది కాజల్ అగర్వాల్. ఆ తరువాత టాప్ హీరోయిన్‌గా ఎదిగి తెలుగు, తమిళ్‌, హిందీలో 50కి పైగా చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పటికీ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. కాగా తనను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన తేజ అంటే కాజల్‌కు ప్రత్యేక అభిమానం. ఆ అభిమానంతోనే ఆయన దర్శకత్వంలో మూడో సారి నటిస్తోంది కాజల్. మరోవైపు తేజకు కూడా కాజల్ అంటే ప్రత్యేక ఇష్టం. ‘‘తాను […]

గురువుకు కాజల్ పుట్టినరోజు శుభాకాంక్షలు

Edited By:

Updated on: Feb 22, 2019 | 2:04 PM

‘లక్ష్మీ కల్యాణం’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది కాజల్ అగర్వాల్. ఆ తరువాత టాప్ హీరోయిన్‌గా ఎదిగి తెలుగు, తమిళ్‌, హిందీలో 50కి పైగా చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పటికీ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. కాగా తనను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన తేజ అంటే కాజల్‌కు ప్రత్యేక అభిమానం. ఆ అభిమానంతోనే ఆయన దర్శకత్వంలో మూడో సారి నటిస్తోంది కాజల్. మరోవైపు తేజకు కూడా కాజల్ అంటే ప్రత్యేక ఇష్టం. ‘‘తాను వరుస పరాజయాల్లో ఉన్నప్పుడు కూడా కాజల్ ఫోన్ చేసేదని, మీరు ఎప్పుడంటే అప్పుడు సినిమా చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను సర్ అని చాలా సార్లు ఆమె తనతో చెప్పేది’’ అని ఓ సందర్భంలో తేజ కూడా చెప్పారు.


ఇదిలా ఉంటే ఇవాళ తేజ పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో కాజల్, తేజకు శుభాకాంక్షలు తెలిపింది. ‘‘నా మెంటర్, దర్శకుడు తేజ గారు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మంచి ఆరోగ్యంతో మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా’’ అంటూ కాజల్ కామెంట్ పెట్టింది. కాగా బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ హీరో హీరోయిన్లుగా తేజ ‘సీత’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం త్వరలో విడుదల అవ్వనుంది. ‘నేనే రాజు నేనే మంత్రి’ తరువాత తేజ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.