బన్ని మూవీలో కాజల్ ఐటెమ్ సాంగ్..?

| Edited By: Pardhasaradhi Peri

Jun 10, 2019 | 3:08 PM

త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ ఒక సినిమా చేస్తున్నాడు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమా, ఇప్పటికే తొలి షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో రెండవ షెడ్యూల్ షూటింగ్‌ను జరుపుకోనుంది. బన్ని సరసన నటించేందుకు పూజా హెగ్డే, నివేదా పేతురాజ్‌లను హీరోయిన్లుగా ఎంపిక చేశారు. ఇక ఈ సినిమాలో మాస్ ఆడియన్స్‌ను ఒక ఊపు ఊపేసే ఐటమ్ సాంగ్ వుండాలని త్రివిక్రమ్ ప్లాన్ చేశాడట. ఈ ప్రత్యేక గీతం కోసం కాజల్ ను ఎంపిక చేశారనేది […]

బన్ని మూవీలో కాజల్ ఐటెమ్ సాంగ్..?
Follow us on

త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ ఒక సినిమా చేస్తున్నాడు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమా, ఇప్పటికే తొలి షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో రెండవ షెడ్యూల్ షూటింగ్‌ను జరుపుకోనుంది. బన్ని సరసన నటించేందుకు పూజా హెగ్డే, నివేదా పేతురాజ్‌లను హీరోయిన్లుగా ఎంపిక చేశారు. ఇక ఈ సినిమాలో మాస్ ఆడియన్స్‌ను ఒక ఊపు ఊపేసే ఐటమ్ సాంగ్ వుండాలని త్రివిక్రమ్ ప్లాన్ చేశాడట. ఈ ప్రత్యేక గీతం కోసం కాజల్ ను ఎంపిక చేశారనేది తాజా సమాచారం. గతంలో ఎన్టీఆర్ తో కలిసి జనతా గ్యారేజ్ లో పక్కా లోకల్ అంటూ కాజల్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. అలాంటి కాజల్ అంతకుమించిన రేంజ్ లో బన్నీతో కలిసి దుమ్ము రేపేస్తుందని చెబుతున్నారు. త్వరలోనే ఈ పాటను చిత్రీకరిస్తారనే టాక్ వినిపిస్తోంది.