మేకప్ లేని ‘చందమామ’.. స్ఫూర్తినిచ్చే సందేశం

| Edited By:

Jun 01, 2019 | 11:00 AM

సినీ ఇండస్ట్రీ అంటేనే.. ఓ గ్లామర్ ఫీల్డ్. ఆ రంగంలో ఉన్న వారి ముఖానికి ఎప్పుడూ రంగు ఎప్పుడూ ఉండాల్సిందే. ఇక అభిమానులు కూడా ఆ అందాన్ని చూసే వారిని ఇష్టపడుతుంటారు. అందుకే బయటికి వచ్చినప్పుడు కూడా హీరోయిన్లు కాస్తైనా మేకప్ వేసుకొని వస్తుంటారు. అయితే మొదటిసారి మేకప్ లేకుండా ఫొటోలు తీసుకొని వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది చందమామ కాజల్. అంతేకాదు ఆ ఫొటోలకు ఓ మెసేజ్ పెట్టి అందరిలో స్ఫూర్తిని నింపుతోంది. See […]

మేకప్ లేని ‘చందమామ’.. స్ఫూర్తినిచ్చే సందేశం
Follow us on

సినీ ఇండస్ట్రీ అంటేనే.. ఓ గ్లామర్ ఫీల్డ్. ఆ రంగంలో ఉన్న వారి ముఖానికి ఎప్పుడూ రంగు ఎప్పుడూ ఉండాల్సిందే. ఇక అభిమానులు కూడా ఆ అందాన్ని చూసే వారిని ఇష్టపడుతుంటారు. అందుకే బయటికి వచ్చినప్పుడు కూడా హీరోయిన్లు కాస్తైనా మేకప్ వేసుకొని వస్తుంటారు. అయితే మొదటిసారి మేకప్ లేకుండా ఫొటోలు తీసుకొని వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది చందమామ కాజల్. అంతేకాదు ఆ ఫొటోలకు ఓ మెసేజ్ పెట్టి అందరిలో స్ఫూర్తిని నింపుతోంది.

‘‘ఎవ్వరైనా తమలోని తామును చూసుకోలేరు. ఎందుకంటే బయటి అందానికే ఈ ప్రపంచం ఆస్వాదిస్తుంటుంది. లేకపోతే సోషల్ మీడియా కూడా మనం అందంగా తయారుకావాలని సూచిస్తుంటుంది. ఒకరోజు నువ్వు అందంగా కనిపించేందుకు ఎన్నో వేల రూపాలయలను వినియోగిస్తుంటాం. ఎక్కడైనా శరీరాకర్షణనే చూస్తుంటారు. మనచుట్టూ జనాలు ఉండాలని మనం అనుకుంటుంటాం. వారు వదిలి వెళ్తే బాధపడుతుంటాం. కానీ నిజమైన సంతోషం అన్నది నిన్ను నువ్వు స్వీకరించినప్పుడు కలుగుతుంది. మేకప్ అన్నది మన బయటి అందాన్ని మాత్రమే చూపిస్తుంది. కానీ మన వ్యక్తిత్వాన్ని మార్చదు కదా..? నిజమైన అందమంటే మనల్ని మనం ఇష్టపడటమే’’ అంటూ కాజల్ పేర్కొంది. కాగా ఈ ఫొటోలపై ఆమె అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘‘మేకప్ లేని ఫొటోలు పెట్టాలంటే ధైర్యం ఉండాలని.. ఆ ధైర్యం చేసిన కాజల్‌కు హ్యాట్సాఫ్’’.. ‘‘మీరు ఎలా ఉన్నా మేము ఇష్టపడతాం’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.