పెళ్ళి తర్వాత జోరు పెంచిన కాజల్.. చేతిలో అరడజనుకు పైగా.. మరో ఛాన్స్ కొట్టెసిన బ్యూటీ..

|

Jan 30, 2021 | 7:44 AM

'లక్ష్మీ కళ్యాణం' సినిమాతో హీరోయిన్‏గా టాలీవుడ్‏లోకి ఎంట్రీ ఇచ్చింది కాజల్. ఆ తర్వాత 'చందమామ' మూవీతో ఒక్కసారిగా టాప్

పెళ్ళి తర్వాత జోరు పెంచిన కాజల్.. చేతిలో అరడజనుకు పైగా.. మరో ఛాన్స్ కొట్టెసిన బ్యూటీ..
Kajal Agarwal
Follow us on

Actress kajal agarwal: ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో హీరోయిన్‏గా టాలీవుడ్‏లోకి ఎంట్రీ ఇచ్చింది కాజల్. ఆ తర్వాత ‘చందమామ’ మూవీతో ఒక్కసారిగా టాప్ హీరోయిన్ రేసులో దూసుకుపోతూ.. దాదాపు అగ్రహీరోలందరితో నటించింది కాజల్. ఇక ఇటీవలే సన్నిహితుడిని పెళ్ళి చేసుకొని వైవాహిక జీవితంలో అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. పెళ్ళి తర్వాత కూడా ఈ అమ్మడు జోరు మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమాలో నటిస్తుంది కాజల్.. దీంతోపాటు మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం.

‘గుళేబగావళి’ ఫేం కళ్యాణ్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో కాజల్ హీరోయిన్‏గా నటించనున్నట్లు సమాచారం. ప్యాషన్ స్టూడియోస్ ఈ మూవీని నిర్మిస్తుండగా.. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. అంతేకాకుండా కొన్ని రోజుల క్రితం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్‏కు ఓకే చెప్పింది ఈ భామ. ఇప్పటికే కాజల్ ‘ఆచార్య’, ‘ఇండియన్ 2’, ‘హై సినామిక’, ‘మోసగాళ్ళు’, ‘పారిస్ పారిస్’, ‘ముంబై సాగ’.. వంటి సినిమాలతో దాదాపు అరడజనుకుపైగా సినిమాల్లో నటిస్తుంది ఈ అమ్మడు.

Also Read:

బంపర్ ఆఫర్ కొట్టేసిన వరుణ్ తేజ్ హీరోయిన్.. సల్మాన్‏తో జోడి కట్టనున్న అందాల భామ..