Monal Gajjar : ఫుల్ బిజీగా మారిన బిగ్ బాస్4 బ్యూటీ.. బాలీవుడ్ లో దూసుకుపోతున్న గుజరాతీ ముద్దుగుమ్మ..

బిగ్ బాస్ సీజన్ 4లో  ప్రేక్షకులను ఆకట్టుకున్న కంటెస్టెంట్ మోనాల్ గజ్జర్.. ఇప్పడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ అమ్మడి అందాలకు కుర్రకారు ఫిదా అయ్యారు.

Monal Gajjar : ఫుల్ బిజీగా మారిన  బిగ్ బాస్4 బ్యూటీ.. బాలీవుడ్ లో దూసుకుపోతున్న గుజరాతీ ముద్దుగుమ్మ..
Follow us

|

Updated on: Jan 30, 2021 | 7:47 AM

Monal Gajjar : బిగ్ బాస్ సీజన్ 4లో  ప్రేక్షకులను ఆకట్టుకున్న కంటెస్టెంట్ మోనాల్ గజ్జర్.. ఇప్పడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ అమ్మడి అందాలకు కుర్రకారు ఫిదా అయ్యారు. బిగ్‌బాస్‌ అనంతరం వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది ఈ గుజరాతీ బ్యూటీ. అప్పటివరకు ఐదారు సినిమాల్లో నటించినా రాని గుర్తింపు ఒక్క బిగ్‌బాస్‌తో సొంతం చేసుకుంది. ఆతర్వాత వరుసగా టాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటుంది.

ఇటీవల బెల్లం కొండ సాయి శ్రీనివాస్ నటించిన ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో ఐటమ్ సాంగ్ లో అదరగొట్టింది మోనాల్. అయితే ఇప్పుడు మోనాల్ బాలీవుడ్ సినిమాపై ఫోకస్ పెట్టింది. బాలీవుడ్ లో మోనాల్ ఇప్పటికే కాగజ్ అనే సినిమాలో నటించింది ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నిర్మించిన ఈ సినిమాకు సతీష్ కౌశిక్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తరవాత మోనాల్ కు బాలీవుడ్ లో వరుసగా అవకాశాలు దక్కుతున్నాయని తెలుస్తుంది. ఇటీవల మోనాల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన బాలీవుడ్ ప్రాజెక్ట్స్ గురించి త్వరలోనే వెళ్లడిస్తానని చెప్పుకొచ్చింది. ఇలా ఈ బిగ్ బాస్ బ్యూటీ ఇటు టాలీవుడ్ లో అటు బాలీవుడ్ లో బిజీ కాబోతుంది .

మరిన్ని ఇక్కడ చదవండి : 

పెళ్ళి తర్వాత జోరు పెంచిన కాజల్.. చేతిలో అరడజనుకు పైగా.. మరో ఛాన్స్ కొట్టెసిన బ్యూటీ..