మరింత ముదిరిన ‘కాళీ’ పోస్టర్ వివాదం.. సమర్థించిన తృణమూల్‌ ఎంపీ.. దీదీ రియాక్షన్‌పై బీజేపీ ఫైర్..

|

Jul 06, 2022 | 9:27 PM

ఆ పోస్టర్‌తో హిందువుల మనోభావాలను దెబ్బతిన్నాయని.. కాళీమాతను అవమానించేలా పోస్టర్ ఉందని ఆరోపణలు వచ్చాయి. ఐటీ యాక్ట్ 2000 ప్రకారం లీనా చేసిన పోస్ట్‌ను తొలగించాలని ప్రభుత్వ ఆదేశాలు జారీచేయడంతో ట్విట్టర్‌ పోస్టును డిలీట్‌ చేసింది. దేశవ్యాప్తంగా పలు స్టేషన్లలో లీనాపై కేసులు కూడా నమోదయ్యాయి.

మరింత ముదిరిన కాళీ పోస్టర్ వివాదం.. సమర్థించిన తృణమూల్‌ ఎంపీ.. దీదీ రియాక్షన్‌పై బీజేపీ ఫైర్..
Kaali Poster
Follow us on

కాళీ అనే పేరుతో తెరకెక్కుతున్న ఓ డాక్యుమెంట‌రీ ఫిల్మ్‌ పోస్టర్ తీవ్ర వివాదం రేపుతోంది. మహిళా డైరెక్టర్ లీనా మ‌ణిమేక‌లై దర్శకత్వంలో ఈ డాక్యుమెంట‌రీ రూపొందుతుండగా.. ఇందుకు సంబంధించిన రిలీజ్ చేసిన పోస్టర్‌పై హిందూ సంఘాలు, పలువురు నటులు, నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఈ పోస్టర్‌లో కాళీమాత పాత్రధారి సిగ‌రెట్ తాగుతున్నట్లు ఉంది. ఎల్జీబీటీ సంబంధించిన జెండాను ప‌ట్టుకోవ‌టం కూడా వివాదానికి కారణమైంది. దీంతో ఈ పోస్టర్‌పై ఒక్కసారిగా దూమారం రేగింది. ఈ నేపథ్యంలో ట్వీట్టర్‌ కూడా స్పందించింది. లీనా పోస్ట్ చేసిన కాళీమాత పోస్టర్ ట్వీట్‌ను డిలీట్ చేసింది. ఆ పోస్టర్‌తో హిందువుల మనోభావాలను దెబ్బతిన్నాయని.. కాళీమాతను అవమానించేలా పోస్టర్ ఉందని ఆరోపణలు వచ్చాయి. ఐటీ యాక్ట్ 2000 ప్రకారం లీనా చేసిన పోస్ట్‌ను తొలగించాలని ప్రభుత్వ ఆదేశాలు జారీచేయడంతో ట్విట్టర్‌ పోస్టును డిలీట్‌ చేసింది. దేశవ్యాప్తంగా పలు స్టేషన్లలో లీనాపై కేసులు కూడా నమోదయ్యాయి. కాళీమాత సిగరేట్ పట్టుకుంటే తప్పేముందంటూ లీనా చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మరింత ముదిరింది. ఈ పోస్టర్‌పై తాను క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని ఆమె ఇప్పటికే స్పష్టం చేసింది.

అటు తృణమూల్‌ ఎంపీ మహువా మొయిత్రా కూడా ఈ వివాదంలో ఇరుక్కున్నారు. కాళీ మాత మాంసాహారం తింటుంది.. మద్యం సేవిస్తుంది.. అంటూ మహువా చేసిన వ్యాఖ్యలపై రగడ కొనసాగుతోంది. మహువా మొయిత్రాను వెంటనే అరెస్ట్ చేయాలని కోల్‌కతాలో బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో కూడా మహువా మొయిత్రాపై కేసు నమోదయ్యింది. త్వరలోనే భోపాల్‌ పోలీసులు నోటీసులు జారీ చేసే అవకాశముంది. ఎంపీ మహువా మొయిత్రా వ్యాఖ్యలతో సంబంధం లేదని తృణమూల్‌ కాంగ్రెస్‌ ట్వీట్‌ చేసింది. ఈ ట్వీట్‌ తరువాత మహువా టీఎంసీ ట్విట్టర్‌ అన్‌ఫాలో అయ్యారు. కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ మాత్రం మహువాకు మద్దతు తెలిపారు. ఈ వివాదంపై మహువా మొయిత్రా మరోసారి స్పందించారు. జై మా కాళీ అంటూ ట్వీట్‌ చేశారు.