
తమిళ హీరో సతీమణి జ్యోతిక సినిమాల్లోకి మళ్ళీ రీ-ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇలా ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిందో లేదో.. వరసపెట్టి ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. తాజాగా జ్యోతిక, మరో సీనియర్ రేవతి ప్రధాన పాత్రల్లో తమిళ దర్శకుడు కళ్యాణ్ రూపొందిస్తున్న చిత్రం ‘జాక్‌పాట్’. ఈ సినిమాను అదే టైటిల్‌తో తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన తెలుగు ట్రైలర్‌ను ఇవాళ విడుదల చేసింది చిత్ర యూనిట్.
ట్రైలర్ విషయానికి వస్తే.. జ్యోతిక, రేవతి తమ నటవిశ్వరూపం చూపించారని చెప్పవచ్చు. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ల రోల్స్‌లో ఇద్దరూ కూడా ఇరగదీసేశారు. ఇది ఇలా ఉండగా ఈ మూవీ కేవలం 35 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసుకోవడం విశేషం. తమిళనాట ఆగష్టు 2న విడుదల కానున్న ఈ సినిమాను సూర్య 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు.
ఇకపోతే తెలుగులో రిలీజ్ డేట్ ఎప్పుడనేది ప్రకటించాల్సి ఉంది. ‘నాన్ కడవుల్’ రాజేంద్రన్, ఆనంద్ రాజ్, మన్సూర్ అలీ, యోగిబాబు కీలక పాత్రలు పోషించగా, నటుడు, దర్శకుడు సముద్రఖని స్పెషల్ రోల్‌లో కనిపించనున్నాడు.