ఆ హీరో ధరించిన షూస్ కోసం గూగుల్‌లో తెగ వెతుకుతున్నారట.. కారణం ఏంటో తెలిస్తే షాకవుతారు..

|

Dec 26, 2020 | 10:39 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏం చేసినా దానికో లెక్క ఉంటుంది. ఎందుకంటే తారక్‌కు ఉన్న ఫాలోయింగ్ అటువంటిది. వెంటనే అది సోషల్ మీడియాలో

ఆ హీరో ధరించిన షూస్ కోసం గూగుల్‌లో తెగ వెతుకుతున్నారట.. కారణం ఏంటో తెలిస్తే షాకవుతారు..
Follow us on

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏం చేసినా దానికో లెక్క ఉంటుంది. ఎందుకంటే తారక్‌కు ఉన్న ఫాలోయింగ్ అటువంటిది. వెంటనే అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ట్రిపుల్ ఆర్ లో నటిస్తున్నాడు. అయితే ఈ చిత్ర షూటింగ్‌కు కాస్త విరామం ఇచ్చిన ఎన్టీఆర్ కొంచెం రిలాక్స్ అవుతున్నాడు. ఈ మధ్య ఆయన ధరించిన షూస్ తెగ వైరల్ అవుతున్నాయి.

ఇటీవల ఆ షూస్ వేసుకుని ఎయిర్ పోర్టులో కనిపించాడు యంగ్ టైగర్. ఇందులో తారక్ వేసుకున్న షూ కంపెనీ పేరు HERMES. ఈ బ్రాండ్ షూస్ కేవలం సెలబ్రిటీస్ మాత్రమే వాడుతుంటారు. ఎందుకంటే వాటి ఖరీదు కూడా అలాగే ఉంటుంది మరి. ఈ షూస్ ప్రత్యేకత ఏంటి.. మా హీరో వేసుకున్నాడు అంటూ తారక్ ఫ్యాన్స్ కొందరు గూగుల్‌లో వెతికేసారు. షూ కాస్ట్ అక్షరాలా 75 వేలకు పైగానే ఉందని తెలిసి షాక్ అవుతున్నారు అభిమానులు. ఇది మా యంగ్ టైగర్ రేంజ్ అంటూ కొందరు అభిమానులు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. తారక్ ఏ వస్తువులు వాడినా అవి తెగ వైరల్ అవుతుంటాయి. ఫ్యాన్స్ వాటిని అనుకరిస్తూ ఉంటారు. అప్పట్లో రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్లికి వచ్చినపుడు ఈయన పెట్టుకున్న వాచ్ చాలా వైరల్ అయింది. ఎన్టీఆర్ కూడాతన కోసమే తయారుచేశార అన్నట్లుగా వస్తువులను ఎంచుకుంటారు. దీంతో ఆయనకు విపరీతమైన క్రేజ్ పెరిగింది.