జూనియర్ ఎన్టీఆర్.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినీ నేపథ్యం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకొని టాలీవుడ్ అగ్ర హీరోల జాబితాలో దూసుకుపోతున్నాడు. ఇక ట్రిపులార్ సినిమాతో ఏకంగా జూనియర్ రేంజ్ అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. ఈ సినిమా ద్వారా విదేశాల్లో ఉన్న సినీ లవర్స్‌ని సైతం జూనియర్ మెస్మరైజ్ చేశాడు. కెరీర్ తొలినాళ్ల నుంచి తనను తాను మార్చుకుంటూ అభిమానుల అభిరుచులకు అనుగుణంగా మారుతూ వస్తున్నాడు ఎన్టీఆర్.
రాఖీ సినిమా తర్వాత పూర్తిగా తన మేకోవర్‌ను పూర్తిగా మార్చుకున్న ఎన్టీఆర్ ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు యంగ్ టైగర్. ఇక అనంతరం టెంపర్ మూవీలో సిక్స్‌ప్యాక్ బాడీలో కనిపించి మరోసారి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాడు. ఈ నేపథ్యంలో తాజాగా తారక్ తన మేకోవర్‌ను మరోసారి మార్చేశారు. జూనియర్ హెయిర్ స్టైల్‌కి సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఎన్టీఆర్ హెయిర్ స్టైలిస్ట్‌తో కలిసి ఉన్న ఈ ఫొటో చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు. కళ్లకు షేడ్స్, నయా హెయిర్ స్టైల్, గడ్డంలో ఎన్టీఆర్ చాలా అట్ట్రాక్టివ్‌గా కనిపిస్తున్నాడు.
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఈ నయా లుక్ కొరటాల శివ సినిమా కోసమే. కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్30వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుంది. ఇక ఈ సినిమాలో అలనాటి అందాల తార శ్రీదేవీ కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించనుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..