ఆ క్రెడిట్ నాగబాబుది కాదు.. మాదే – జీవితా రాజశేఖర్

|

May 26, 2019 | 4:35 PM

ఇటీవల జరిగిన ‘మా’ ఎన్నికల్లో నరేష్ ప్యానల్ విజయానికి ప్రముఖ నటుడు నాగబాబే కారణం అని వస్తున్న వార్తలను జీవితా రాజశేఖర్ ఖండించారు. రీసెంట్ గా జూబ్లీ హిల్స్ లో తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీవిత మాట్లాడుతూ ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్(మా) అనేది ఓ చిన్న ఫ్యామిలీ. అందులో 500-600 ఓట్లు ఉంటాయి.  నాగ‌బాబుగారు ఇంటింటికీ వెళ్లి ఓట్లేయ‌మ‌ని ఏమి చెప్ప‌లేదు. మేము మా ఫ్యామిలీ అంతా క‌ష్ట‌ప‌డ్డాం. మేం అందరం క్యాంపెయిన్ […]

ఆ క్రెడిట్ నాగబాబుది కాదు.. మాదే - జీవితా రాజశేఖర్
Follow us on
ఇటీవల జరిగిన ‘మా’ ఎన్నికల్లో నరేష్ ప్యానల్ విజయానికి ప్రముఖ నటుడు నాగబాబే కారణం అని వస్తున్న వార్తలను జీవితా రాజశేఖర్ ఖండించారు. రీసెంట్ గా జూబ్లీ హిల్స్ లో తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీవిత మాట్లాడుతూ ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్(మా) అనేది ఓ చిన్న ఫ్యామిలీ. అందులో 500-600 ఓట్లు ఉంటాయి.  నాగ‌బాబుగారు ఇంటింటికీ వెళ్లి ఓట్లేయ‌మ‌ని ఏమి చెప్ప‌లేదు. మేము మా ఫ్యామిలీ అంతా క‌ష్ట‌ప‌డ్డాం. మేం అందరం క్యాంపెయిన్ చేసుకున్నామని జీవిత రాజశేఖర్ తెలిపారు.
నేను, రాజ‌శేఖ‌ర్‌, మా కూతుర్లు ఇద్ద‌రూ ప్ర‌తి మెంబ‌ర్‌ కి ఫోన్ చేశాం. మేం మంచి చేస్తాం.. చేయ‌గ‌లం అని వాళ్లు న‌మ్మారు కాబ‌ట్టి మాకు న‌మ్మ‌కంతో ఓటేశారు. దీనికి తోడు నాగబాబుగారు కూడా సపోర్ట్ చేయడంతో మెంబర్స్ అందరూ మాలో జెన్యూనిటీ ఉందని నమ్మారు. అందుకే వాళ్ళు మాకు ఓటు వేసి గెలిపించారు. అంతే తప్ప కేవ‌లం నాగ‌బాబుగారు చెప్పార‌నే ఎవ‌రూ మాకు ఓటేయ‌లేదు. నాగ‌బాబుగారి స‌పోర్ట్ వ‌ల్ల‌నే గెలిచామ‌నేదంతా కూడా సోష‌ల్ మీడియా క్రియేష‌న్. మ‌ళ్లీ మేము పొలిటిక‌ల్‌గా ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా ఈ సోష‌ల్ మీడియానే మీకు అలా స‌పోర్ట్ చేసిన‌ప్పుడు మీరెలా వ్య‌తిరేకంగా వెళ‌తారని ప్రశ్నిస్తూ ఈ సందర్భంగా సోషల్ మీడియాపై జీవిత తీవ్ర విమర్శలు చేశారు.