రాజశేఖర్‌ది చిన్నపిల్లల మనస్తత్వం: జీవిత

‘మా’ డైరీ ఆవిష్కరణ‌లో జరిగిన వివాదంపై జీవితా రాజశేఖర్‌ స్పందించారు. రాజశేఖర్‌ది చిన్నపిల్లల మనస్తత్వం అని చెప్పిన ఆమె.. ఆయన ఎమోషనల్‌గా ఫీల్ అవ్వడం వల్లనే ఇలా జరిగిందని చెప్పుకొచ్చారు. ‘మా’ అభివృద్ధికి చిరంజీవి ఎన్నో సలహాలు ఇచ్చారని.. గొడవలు సద్దుమణిగేందుకు చాలా సమయం ఇచ్చారని.. వారి నుంచి ఎంతో నేర్చుకున్నామని ఆమె వెల్లడించారు. ఎక్కడైనా గొడవలు రావడం సహజమని ఆమె అన్నారు. తాము కూడా మనుషులమని, దేవుళ్లం కాదని జీవిత ఈ సందర్భంగా తెలిపారు. ఎవరు […]

రాజశేఖర్‌ది చిన్నపిల్లల మనస్తత్వం: జీవిత

Edited By:

Updated on: Jan 02, 2020 | 2:37 PM

‘మా’ డైరీ ఆవిష్కరణ‌లో జరిగిన వివాదంపై జీవితా రాజశేఖర్‌ స్పందించారు. రాజశేఖర్‌ది చిన్నపిల్లల మనస్తత్వం అని చెప్పిన ఆమె.. ఆయన ఎమోషనల్‌గా ఫీల్ అవ్వడం వల్లనే ఇలా జరిగిందని చెప్పుకొచ్చారు. ‘మా’ అభివృద్ధికి చిరంజీవి ఎన్నో సలహాలు ఇచ్చారని.. గొడవలు సద్దుమణిగేందుకు చాలా సమయం ఇచ్చారని.. వారి నుంచి ఎంతో నేర్చుకున్నామని ఆమె వెల్లడించారు. ఎక్కడైనా గొడవలు రావడం సహజమని ఆమె అన్నారు. తాము కూడా మనుషులమని, దేవుళ్లం కాదని జీవిత ఈ సందర్భంగా తెలిపారు. ఎవరు మంచి చేసినా అది అందరికీ వర్తిస్తుందని ఆమె పేర్కొన్నారు. అందరం కలిసే పనిచేసి.. ఏ సమస్య వచ్చినా పరిష్కరించుకుంటామని జీవిత ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. కాగా మా డైరీ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఆయన మాట్లాడే సమయంలో రాజశేఖర్ పలుమార్లు కల్పించుకున్నారు. ఒకానొక సమయంలో చిరు నుంచే కాకుండా వేరే వారి దగ్గరి నుంచి కూడా మైక్ లాక్కొన్ని ఆయన ప్రసంగానికి అడ్డుపడ్డారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ కాస్త అసహనానికి గురై.. కార్యక్రమాన్ని రసాభాస చేసేందుకు రాజశేఖర్ ప్లాన్ చేసుకొని వచ్చినట్లు కనిపిస్తోందని అన్నారు. పెద్దలకు గౌరవం లేనప్పుడు తాము ఇక్కడెందుకుండాలని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.