JD On Maheswari :  హీరోయిన్ మహేశ్వరితో ఉన్న రిలేషన్ ప్రస్తావన.. ఫైర్ అయిన సీనియర్ హీరో

|

Mar 05, 2021 | 6:33 PM

సంచలన దర్శకుడు, వివాదాల వర్మ ఓ స్పెషల్ అయితే అతని స్కూల్ నుంచి వచ్చిన చాలా మంది కూడా వర్మ బాటలోనే నడుస్తాం అని అంటారు. ఓ పట్టాన ఏ విషయంలోనూ...

JD On Maheswari :  హీరోయిన్ మహేశ్వరితో ఉన్న రిలేషన్ ప్రస్తావన.. ఫైర్ అయిన  సీనియర్ హీరో
Follow us on

JD On Maheswari : సంచలన దర్శకుడు, వివాదాల వర్మ ఓ స్పెషల్ అయితే అతని స్కూల్ నుంచి వచ్చిన చాలా మంది కూడా వర్మ బాటలోనే నడుస్తాం అని అంటారు. ఓ పట్టాన ఏ విషయంలోనూ రాజీ పడరు. ఎవరున్నా సరే లెక్క చేయకుండా తాము అనుకున్నది చెప్పేస్తారు.. అలా వర్మ తర్వాత తన మనస్సుకు అనిపించింది నచ్చింది చెప్పేసే వ్యక్తి జేడీ చక్రవర్తి. శివ సినిమాతో నటుడుగా ప్రస్థానం ప్రారంభించిన జేడీ… విలన్ , హీరో, క్యారెక్టర్ ఆరిస్టు ఇలా విభిన్న పాత్రల్లో నటించి తనదైన శైలీలో మెప్పించాడు. ఇప్పటికీ తనదైన పంథాని అనుసరిస్తూ సినిమాలు చేస్తున్నాడు జేడీ. ఇటీవల ’70 ఎం.ఎం.’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ.. యాంకర్ అడిగిన ప్రశ్నకు షాకింగ్ సమాధానం చెప్పారు.

గులాబీ సినిమా సమయంలో హీరోయిన్ మహేశ్వరితో మీకు లవ్ ట్రాక్ నడిచింది అనే వార్తలు వినిపించాయి.. ఎంతవరకూ నిజం అని అడిగింది. మీతో నటించిన హీరోయిన్లతో ఇప్పటికీ మీరు టచ్ లో ఉన్నారా ..? ‘సిస్టర్ మహేశ్వరి’అని అంటారుగా ఆమెతో టచ్‌లో వున్నారా?” అనే ప్రశ్నకు జేడీ ఫైర్ అయ్యారు.

సిస్టర్ మహేశ్వరి అని నీతో చెప్పానా?.. నిజాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు కదా అని చెప్పి వుంటాను. నీకు ఇంకా క్లారిటీ ఇవ్వాలా.. ఏజ్‌లో ఆమె కంటే ఒకటి రెండేళ్లు పెద్ద కావచ్చు కానీ ఇంటలిజెన్స్‌లో మ్యాగీ (మహేశ్వరీ) కంటే చిన్నోడినే.” అంటూ నవ్వుతూ క్లారిటీ ఇచ్చారు జేడీ.

జేడీ చక్రవర్తి, మహేశ్వరి జంటగా నటించిన ‘గులాబీ’ చిత్రం1995లో బాక్సాఫీస్ వద్ద సంచలన హిట్. ఆ టైమ్‌లో వీరిద్దరు ప్రేమలో వున్నారంటూ వార్తలు షికారు చేసిన సంగతి తెలిసిందే.
Also Read :

కల్తీసారా ఘటనలో ఎక్సైజ్ కోర్టు సంచలన తీర్పు.. 9 మందికి మరణ శిక్ష.. మరికొంత మందికి..

 ఈ టాలీవుడ్ టాప్ హీరో తనయుడు ఎవరో గుర్తుపట్టగలరా..? ఎనీ గెస్…?