తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్నారు జగపతి బాబు. అప్పట్లో ఫ్యామిలీ హీరోగా ఉన్న జగపతి బాబు ఆ తర్వాత కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. తర్వాత తన బాలయ్య ప్రధాన పాత్రలో నటించిన లెజెండ్ సినిమాలో విలన్ పాత్ర పోషించి తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించి సూపర్ సక్సెస్ అయ్యాడు ఈ అందాల నటుడు. అటు హీరోగానే కాకుండా, విలన్ పాత్రలో కూడా తనదైన మార్క్‌ను చూపించారు. అయితే గత కొంత కాలంగా జగపతి బాబు ప్రధాన పాత్రలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
డైరెక్టర్ విద్యాసాగర్ రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే జగపతి బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు ఫాదర్ చిట్టి ఉమా కార్తీక్ (FUK) టైటిల్‌ను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో కార్తీక్, అమ్ము అభిరామి యంగ్ కపుల్ పాత్రలో నటిస్తున్నారు. ఫుల్ కామెడీ రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా ఈ మూవీ రాబోతుందని చిత్రవర్గాలు తెలిపాయి. అటు ఈ చిత్రానికి బీమ్స్ సెసిరొలియా సంగీతాన్ని అందిస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టు సహశ్రిత ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోందని సమాచారం. ఈ సినిమా ముఖ్యంగా నాలుగు పాత్రల చుట్టూ తిరుగుతుందని, సినిమాలోని భావోద్వేగాలు, కామెడీ ప్రేక్షకులను అలరిస్తాయని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ మూవీని వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేసేందుకు ఈ చిత్రయూనిట్స్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.