Jabardasth Ramu: జబర్దస్త్ షోలో అందరికన్నా ఎక్కువగా సంపాదించింది ఆ ఒక్కడే.. జబర్దస్త్ కమెడియన్ రాము..
జబర్దస్త్ రాము తన తాజా ఇంటర్వ్యూలో జబర్దస్త్ షోలో అత్యధిక రెమ్యూనరేషన్ పొందుతున్న కళాకారుల పేర్లను వెల్లడించారు. అలాగే కొందరు సినిమాలు, ఈవెంట్లు, జబర్దస్త్ ద్వారా బాగా సంపాదించారని ఆయన తెలిపారు. సంపాదన కంటే మనశ్శాంతికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని రాము వెల్లడించారు. . తన చుట్టూ ఉన్న చాలా మంది తోటి కళాకారులు ఫ్లాట్లు, ఇల్లు కొనుగోలు చేసి ఆర్థికంగా స్థిరపడినప్పటికీ, తాను ఇంకా కొనుక్కోలేదని రాము తెలిపారు.

జబర్దస్త్ కమెడియన్ రాము ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, సినీ ప్రయాణం గురించి వివరించారు. జబర్దస్త్ వేదికపై అత్యధికంగా సంపాదించే కళాకారుల గురించిన వివరాలను వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూలో రాము తనతోటి కళాకారుల ఆర్థిక ప్రగతిని, తన స్వంత జీవిత విధానాన్ని తెలిపారు. రాము తన చుట్టూ ఉన్న స్నేహితులు, తోటి కళాకారులు ఫ్లాట్లు, ఇళ్ళు కొనుగోలు చేసి, తమ వృత్తిలో బాగా స్థిరపడ్డారని అంగీకరించారు. అయితే, తాను ఇంకా అలాంటి ఆస్తులు సమకూర్చుకోలేదని చెప్పారు. దీనిపై తనకు ఎటువంటి విచారం లేదని రాము స్పష్టం చేశారు. “నాకు బాధ ఉండదు సార్. ఎందుకంటే… అదే చెప్తున్నా కదా సార్. నీ దారి నీది సార్. నీ వే నీది” అని ఆయన తన తత్వాన్ని వివరించారు. సంపాదనను కేవలం ఆర్థిక లాభంగా కాకుండా, ప్రశాంతమైన ఆలోచనలతో ముడిపడి ఉన్న ఒక ప్రక్రియగా చూస్తానని. సరైన ఆలోచనలకు డబ్బులు వస్తాయనుకుంటే, తాను అనేక గొప్ప ఆలోచనలను ఇవ్వగలనని రాము అన్నారు.
జబర్దస్త్ షోలో మొదటి నుండి ఇప్పటి వరకు అత్యధికంగా ఎవరు సంపాదించారనే ప్రశ్నకు రాము స్పష్టమైన సమాధానం ఇచ్చారు. ఈ జాబితాలో చమ్మక్ చంద్ర అన్న, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను అన్న వంటి వారి పేర్లను ఆయన పేర్కొన్నారు. ఈ కళాకారులు కేవలం జబర్దస్త్ షో ద్వారానే కాకుండా, సినిమాల ద్వారా, వివిధ ఈవెంట్ల ద్వారా కూడా బాగా సంపాదించుకొని ఆర్థికంగా స్థిరపడ్డారని రాము వివరించారు. “వీళ్లందరూ అంటే అటు సినిమాల కావచ్చు, ఇటు ఈవెంట్స్ కావచ్చు, ఇటు జబర్దస్త్ కావచ్చు. మూడు విధాలుగా వాళ్లకు కలిసి వచ్చింది. వాళ్లు బాగా సంపాదించుకున్నారు” అని రాము తెలిపారు. కాలక్రమేణా వారికి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని, తమను తాము కమర్షియలైజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారని ఆయన అంగీకరించారు.
అయితే, తోటివారి ఎదుగుదలను చూసి తనకు ఎటువంటి అసూయ లేదా బాధ ఉండదని రాము చెప్పారు. “వాళ్లు ఎదిగారు, ఇంత సంపాదించుకున్నారు ఇది అని అసలు ఆ భావమే ఉండదు సార్ మనకు. మన వేలో మనం వెళ్తున్నాం, మన పని మనం చేస్తున్నాం, మనకు వచ్చే రోజు మనకు వస్తది” అని ఆయన తన ప్రశాంతమైన ఆలోచనను వ్యక్తం చేశారు. సంపద కన్నా మనశ్శాంతి, ఆత్మసాక్షి ప్రశాంతంగా ఉండటమే ముఖ్యమని రాము చెప్పారు. తన మనసు ప్రశాంతంగా ఉన్నందువల్లే నిద్ర వెంటనే పట్టగలుగుతానని, తాను చేసే పనికి న్యాయం చేస్తున్నప్పుడు ప్రశాంతమైన నిద్ర వస్తుందని ఆయన తెలిపారు.
ఎక్కువమంది చదివినవి : Cinema: 5 ఏళ్లుగా తగ్గని డిమాండ్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ మూవీ.. ఓటీటీలో గత్తరలేపుతుంది..
