జబర్దస్త్ ఆర్టిస్ట్(Jabardasth Fame).. అభి (అదిరే అభి)(Abhi) ప్రమాదానికి గురయ్యాడు. సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆయన ప్రమాదవశాత్తు గాయపడ్డారని తెలుస్తోంది. వెంటనే స్పందించిన యాజమాన్యం అభిని ఆస్పత్రికి తరలించారు. అతనిని పరీక్షించిన వైద్యులు.. చికిత్స చేసి చేతికి 15 కుట్లు వేసినట్లు తెలిసింది. కాళ్లకూ గాయాలవడంతో కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం. అభి ప్రధాన పాత్రలో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. షూటింగ్ లో భాగంగా యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు. ఫైటర్ ను ఎదుర్కొనే సమయంలో అదిరే అభి ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదంలో చేతికి, కాలికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి క్షేమంగా ఉందన్నారు.
కాగా..అభినయ కృష్ణ అలియాస్ అదిరే అభి తెలుగు సినిమాలు, టీవీ షోల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. కొన్ని నెలల క్రితం ఆయన జబర్దస్త్ షో నుంచి బయటకు వచ్చాడు. మా టీవీలో ప్రసారమవుతున్న ‘కామెడీ స్టార్స్’లో చేశాడు. ఆ తర్వాత టీవీ షోలకు దూరంగా ఉంటూ సినిమాల్లో బిజీగా మారాడు. ఈయన స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ కేరీర్ లో ముందుకు వెళ్తున్నాడు. యాంకర్‌గా, డ్యాన్సర్‌గా, స్టాండ్-అప్ కమెడియన్‌గా పనిచేస్తున్నాడు. జబర్దస్త్ లో సూపర్ హిట్ స్కిట్లతోనూ ప్రేక్షకులను అలరించాడు. సినిమాల్లోనూ హీరోగా అవకాశాలను దక్కించుకుంటున్నాడు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి