ఉపాసనను భార్యగా పొందడం నా అదృష్టం: రామ్ చరణ్‌

ఉపాసనను భార్యగా పొందడం తన అదృష్టమని చెప్పుకొచ్చారు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌. ఇండిపెండెన్స్ డే సందర్భంగా టీవీ9 తెలుగుకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ

ఉపాసనను భార్యగా పొందడం నా అదృష్టం: రామ్ చరణ్‌

Edited By:

Updated on: Aug 16, 2020 | 12:00 PM

Ram Charan about Upasana: ఉపాసనను భార్యగా పొందడం తన అదృష్టమని చెప్పుకొచ్చారు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌. ఇండిపెండెన్స్ డే సందర్భంగా టీవీ9 తెలుగుకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మేమిద్దరం ఒకరినొకరు గౌరవించుకుంటామని, తమ జర్నీ చాలా బావుందని ఆయన అన్నారు. కరోనా నేపథ్యంలో తను చాలా బిజీగా ఉందని చెర్రీ తెలిపారు. మొదటి 30-40 రోజులు ఉపాసన ఇంట్లో ఉన్నా తాను ఒంటరిగా క్వారంటైన్ అయ్యానని చెర్రీ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో ఉపాసన ఇంటి నుంచే పనిచేస్తోందని.. కేవలం తినే సమయంలో మాత్రమే ఇద్దరం కలుసుకునేవాళ్లమని తెలిపారు. ఫ్రంట్‌ లైన్ వర్కర్‌గా ఉపాసన బిజీగా ఉండేదని.. కరోనా వేళ వారి కష్టాన్ని తాను వ్యక్తిగతంగా చూశానని వెల్లడించారు.

Read More:

విశాఖలో పుర్రెతో కలకలం రేపిన సైకో

ధోనిపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సంచలన ట్వీట్‌