‘మన్మధుడు 2’ అవంతిక పరిచయం..!

అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మన్మధుడు 2’. ఈ సినిమా ‘మన్మధుడు’ సినిమాకు సీక్వెల్. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి పాత్రల పరిచయానికి రంగం సిద్ధం అయింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్.. అవంతిక అనే పాత్రలో నటిస్తోంది. ఇక ఆ పాత్ర పరిచయానికి టైం ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. ఈ నెల 9వ తేదీన ఉదయం 9 […]

మన్మధుడు 2 అవంతిక పరిచయం..!

Updated on: Jul 08, 2019 | 4:22 AM

అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మన్మధుడు 2’. ఈ సినిమా ‘మన్మధుడు’ సినిమాకు సీక్వెల్. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి పాత్రల పరిచయానికి రంగం సిద్ధం అయింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్.. అవంతిక అనే పాత్రలో నటిస్తోంది. ఇక ఆ పాత్ర పరిచయానికి టైం ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. ఈ నెల 9వ తేదీన ఉదయం 9 గంటలకు అవంతికను పరిచయం చేయబోతున్నామని యూనిట్ ఓ పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది.

సమంతా, కీర్తి సురేష్‌లు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో నాగ్ ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్, వయాకామ్ 18 మూవీస్, ఆనంది ఆర్ట్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఆగష్టు 9 విడుదల కానుంది.