Singer Sayali kamble: స్నేహితునితో ఇండియన్‌ ఐడల్‌ రన్నరప్‌ ఎంగేజ్‌మెంట్‌.. సోషల్‌ మీడియాలో ఫొటోలు వైరల్‌..

తన అద్భుతమైన గాత్రంతో కొన్నిరోజుల క్రితం జరిగిన ఇండియన్‌ ఐడల్‌- 12 పోటీల్లో సెకండ్‌ రన్నరప్‌గా నిలిచింది ప్రముఖ సింగర్‌ సయాలీ కాంబ్లే. ఈ మ్యూజిక్‌ రియాలిటీ షోలో విజేతగా నిలవకపోయినా తన ట్యాలెంట్‌తో ఎంతోమంది సంగీతాభిమానుల మన

Singer Sayali kamble: స్నేహితునితో ఇండియన్‌ ఐడల్‌ రన్నరప్‌ ఎంగేజ్‌మెంట్‌.. సోషల్‌ మీడియాలో ఫొటోలు వైరల్‌..

Updated on: Dec 26, 2021 | 12:19 PM

తన అద్భుతమైన గాత్రంతో కొన్నిరోజుల క్రితం జరిగిన ఇండియన్‌ ఐడల్‌- 12 పోటీల్లో సెకండ్‌ రన్నరప్‌గా నిలిచింది ప్రముఖ సింగర్‌ సయాలీ కాంబ్లే. ఈ మ్యూజిక్‌ రియాలిటీ షోలో విజేతగా నిలవకపోయినా తన ట్యాలెంట్‌తో ఎంతోమంది సంగీతాభిమానుల మనసులు గెల్చుకుందీ యంగ్‌ అండ్‌ బ్యూటిఫుల్‌ సింగర్‌. కాగా ఈ అమ్మడు మూడేళ్లుగా ధావల్‌ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. తాజాగా కుటుంబ సభ్యుల అనుమతితో తమ మూడేళ్ల ప్రేమ బంధాన్ని మూడుముళ్ల బంధంగా మార్చుకునేందుకు సిద్ధమయ్యారీ లవ్‌ బర్డ్స్‌. ఈ క్రమంలో పెద్దల సమక్షంలో వేడుకగా నిశ్చితార్థం జరుపుకున్నారు. ఈ వేడుకకు ఇండియన్‌ ఐడల్‌ కంటెస్టెంట్లు సహా పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

నా ఊపిరి ఉన్నంతవరకు..
కాగా తమ ఎంగేజ్‌మెంట్‌ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారీ ప్రేమ పక్షులు. ‘నీతో చిరునవ్వులు చిందించడానికి, బాధలో ఉన్నప్పుడు ఆనందం వైపు నడిపించడానికి, జీవితాంతం ప్రేమిస్తూ అనునిత్యం నీ వెన్నంటే ఉంటాను. నా ఊపిరి ఉన్నంతవరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను’ అంటూ ఒకరిపై మరొకరు ప్రేమను తెలుపుకున్నారు. కాగా ధావన్‌ ఓ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. ఇక సయాలీ, ధావన్‌లు మూడేళ్ల క్రితం జరిగిన ఓ కార్యక్రమంలో మొదటిసారిగా పరిచయమయ్యారు. మొదట మంచి స్నేహితులుగా, ఆతర్వాత ప్రేమికులుగా మారారు. తాజాగా ఎంగేజ్‌మెంట్‌తో తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. కాగా ప్రస్తుతం సయాలీ మ్యూజిక్‌ ఈవెంట్లతో బిజీగా ఉంది. విదేశీ షెడ్యూల్స్‌ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాదే వీరు పెళ్లిపీటలెక్కనున్నట్లు సమాచారం.

Also Read: Kartik Aaryan: లేడీ ఫ్యాన్‌కు ఫ్రాంక్‌ కాల్‌ చేసిన బాలీవుడ్‌ హ్యాండ్సమ్ హీరో.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Petrol Diesel Price: తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్న వ్యత్యాసం.. మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..

Ram Gopal Varma: రాజమౌళి సినిమాకు వాళ్లు మాత్రమే రావాలంటోన్న రామ్ గోపాల్ వర్మ.. ఆర్ఆర్ఆర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్..