Indian Idol 12 Grand Finale: సింగింగ్ పెర్ఫామెన్స్‌కి నేషనల్ లెవల్‌లో పట్టం కట్టే ఇండియన్ ఐడల్ 12 సీజన్.. క్లయిమాక్స్‌లోకొచ్చేసింది. టైటిల్ కోసం తొలిసారిగా ఒక తెలుగమ్మాయి పోటీ పడుతున్నారు. మరికొద్దిగంటల్లో తేలే ఆ ఫలితం కోసం.. దక్షిణాది సంగీతప్రియులు కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
ఇండియన్ ఐడల్ 12 సీజన్ గ్రాండ్ ఫినాలేకి గ్రౌండ్ ప్రిపేరైంది. గత 11 సీజన్ల కంటే భిన్నంగా.. భారీ స్థాయిలో ఈసారి ఫైనల్స్‌కి స్కెచ్ వేశారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా 12 గంటల పాటు జరిగే మారథాన్ షో ద్వారా టైటిల్ విన్నర్‌ని ఎంపిక చేస్తారు.
30 రౌండ్స్‌గా జరిగే ఈ మారథాన్ ఎపిసోడ్‌లో మొత్తం 200 పాటలు పెర్ఫామ్ చేసేందుకు రెడీ అవుతున్నారు కంటెస్టెంట్‌లు. కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా లాంటి స్టార్లు గెస్ట్‌లుగా పార్టిసిపేట్ చేస్తారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ అప్పియరెన్స్ కూడా ఇక్కడో స్పెషల్ ఎట్రాక్షన్.
డే వన్ నుంచి సెమీ ఫైనల్స్ వరకూ తన గ్రేట్ టాలెంట్‌తో అలరించిన తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ.. ఈసారి టైటిల్ ఫేవరిట్స్‌లో వున్నారు. జడ్జెస్ నుంచి స్టాండింగ్ ఒవేషన్ దక్కించుకున్న షణ్ణు.. ఫైనల్స్‌లో కూడా సత్తా చాటబోతున్నారు. ఆన్‌లైన్ ఓటింగ్ ద్వారా తనకు సపోర్ట్ చేయాలని అప్పీల్ చేశారు షణ్ముఖప్రియ.
Also read:
CM Jagan: రేపు తూర్పుగోదావరి జిల్లాలో సీఎం పర్యటన.. జగనన్న విద్యాకానుక కింద పిల్లలకు కిట్లు పంపిణీ
Prabhas Movie: ప్రభాస్ మూవీకి ఆరెస్సెస్ సెగ? అందుకే ఎలర్ట్ అయ్యారా?
Lokesh: ‘మధ్యాహ్నమే నిద్ర పోతున్నారా..’ రమ్య హత్య ఉదంతంపై నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు