అల్లు అర్జున్.. ఇప్పుడీ పేరు తెలియని సగటు భారతీయ సినీ ప్రేక్షకుడు ఉండడనడంలో ఎలాంటి సందేహం లేదు. పుష్ప సినిమా తర్వాత ఒక్కసారిగా నేషనల్ క్రేజ్ సంపాదించుకున్నారీ ఐకాన్ స్టార్. నిజానికి పుష్పకు ముందే అల్లు అర్జున్ నటించిన తెలుగు సినిమాల డబ్బింగ్ వెర్షన్‌లు కేరళతో పాటు మహారాష్ట్రలోనూ ప్రేక్షకులకు ఓ రేంజ్‌లో ఆకట్టుకున్నాయి. అయితే పాన్ ఇండియా రేంజ్‌లో వచ్చిన పుష్ప సినిమాతో ఒక్కసారిగా బన్నీ క్రేజ్ విదేశాలకు సైతం పాకింది. పుష్పలో బన్నీ డైలాగ్స్, యాక్టింగ్‌కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. దీంతో ప్రస్తుతం బన్నీ మార్కెట్ వ్యాల్యూ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది.
బడా కంపెనీలు సైతం బన్నీ కాల్షిట్స్ కోసం క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం కోకా కోలా, జొమాటో, కేజీఎఫ్, ఆస్ట్రల్, సెవన్ అప్, శ్రీ చైతన్య విద్యా సంస్థలు, రెడ్ బస్, ర్యాపిడో.. ఇలా చెప్పుకుంటూ పోతే బన్నీ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంస్థలు ఎన్నో. నిజానికి వీటిలో మెజారిటీ డీల్స్ పుష్ప చిత్రానికి విడుదలకు ముందు జరిగినవే కావడం విశేషం. అయితే పుష్ప మ్యానియా తోడవడంతో ఈ బ్రాండ్స్ మరింత క్రేజ్ వచ్చింది. నేషనల్ వైడ్‌గా బన్నీకి వచ్చిన క్రేజ్‌ను క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి సంస్థలు.
బన్నీ ఉంటే చాలు తమ బ్రాండ్స్ జెట్ స్పీడులో దూసుకుపోవడం ఖాయమని భావిస్తోన్న కంపెనీలు ఎంత ఖర్చు అయినా వెచ్చించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు బన్నీ ఒక యాడ్‌కు షూటింగ్‌కు రోజుకు కనీసం రూ. 7 కోట్లకుపైగా కంపెనీలు ఇస్తున్నట్లు సమాచారం. ఇది కొందరు బాలీవుడ్ హీరోల కంటే ఎక్కువ కావడం విశేషం.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..