
ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్‌పై లోక నాయకుడు కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ లైవ్ సెషన్స్ పాల్గొన్న ఈ ఇద్దరు వారి వారి కెరీర్‌లో ఎదురైన కొన్ని ఙ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా రెహమాన్ గురించి కమల్ మాట్లాడారు. ”సంగీత దర్శకుల్లో ఇళయరాజా అంటే నాకు చాలా ఇష్టం. మొదటి నుంచి ఆయన పాటలకే నేను కనెక్ట్ అయ్యా. ఆ తరువాత రెహమాన్ పాటల గొప్పదనాన్ని తెలుసుకునేందుకు నాకు రోజులు పట్టింది” అని అన్నారు.
ఇక ఇండియన్ సినిమాకు రెహమాన్ కంపోజ్ చేసిన ‘కప్పలెరి పొయచ్చు’ అనే పాట నాకు అస్సలు నచ్చలేదు. ఈ పాటపై శంకర్ దగ్గర కూడా నేను అసంతృప్తిని వ్యక్తం చేశా. అయితే ఆ పాట చిత్రీకరణ పూర్తై ఔట్‌పుట్‌ని చూసిన తరువాత నాకు చాలా బాగా నచ్చింది అని అన్నారు. కాగా గతంలో కమల్ నటించిన ఇండియన్, తెనాలి చిత్రాలకు రెహమాన్ సంగీతం అందించగా.. త్వరలో ‘తలైవాన్ ఇరుక్కిన్‌ద్రాన్’ కోసం వీరిద్దరు కలిసి పనిచేయబోతున్నారు. 1992లో వచ్చిన ‘తేవార్ మాగన్'(తెలుగులో క్షత్రియ పుత్రుడు) సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కబోతోంది.
Read This Story Also: చంద్రబాబు ఇంటి వద్ద పనిచేసిన కానిస్టేబుల్‌కు కరోనా