‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో యాక్ట్ చేయడం లేదు: అజయ్‌ దేవగణ్

|

Feb 18, 2019 | 6:05 PM

ముంబయి: సౌత్ ఇండియన్ టాప్ డైరక్టర్ ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమాలో నటించడం లేదని బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ అన్నారు. ఆయన ఇందులో గెస్ట్ రోల్‌లో మెరబోతున్నారంటూ  ఇటీవల ప్రచారం జరిగింది. దీని గురించి అజయ్‌ను తాజాగా మీడియా ప్రశ్నించింది. ఆయన స్పందిస్తూ.. ‘నేను ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమాలో నటించబోతున్నాననే విషయాన్ని మర్చిపోండి. ఎందుకంటే.. అసలు ఈ ప్రాజెక్టు కోసం నన్ను ఎవరూ సంప్రదించలేదు. కాబట్టి మీరు విన్నవార్తల్లో నిజం లేదు’ అని అజయ్‌ చెప్పారు. మల్టీస్టారర్‌గా తెరకెక్కుతోన్న ‘ఆర్‌.ఆర్.ఆర్‌’ సినిమాలో టాలీవుడ్ టాప్ స్టార్స్ […]

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో యాక్ట్ చేయడం లేదు: అజయ్‌ దేవగణ్
Follow us on

ముంబయి: సౌత్ ఇండియన్ టాప్ డైరక్టర్ ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమాలో నటించడం లేదని బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ అన్నారు. ఆయన ఇందులో గెస్ట్ రోల్‌లో మెరబోతున్నారంటూ  ఇటీవల ప్రచారం జరిగింది. దీని గురించి అజయ్‌ను తాజాగా మీడియా ప్రశ్నించింది. ఆయన స్పందిస్తూ.. ‘నేను ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమాలో నటించబోతున్నాననే విషయాన్ని మర్చిపోండి. ఎందుకంటే.. అసలు ఈ ప్రాజెక్టు కోసం నన్ను ఎవరూ సంప్రదించలేదు. కాబట్టి మీరు విన్నవార్తల్లో నిజం లేదు’ అని అజయ్‌ చెప్పారు.

మల్టీస్టారర్‌గా తెరకెక్కుతోన్న ‘ఆర్‌.ఆర్.ఆర్‌’ సినిమాలో టాలీవుడ్ టాప్ స్టార్స్ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ కథానాయకులుగా నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య సినిమాను నిర్మిస్తున్నారు. ఎమ్‌.ఎమ్‌. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తతం ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. భారీ స్థాయిలో సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఇందులో యాక్ట్ చేసే హీరోయిన్స్ వివరాలు ఎనౌన్స్ చేయలేదు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.