Hyderabad Traffic Police: దర్శకుడు త్రివిక్రమ్‌ కారు తనిఖీ.. జరిమానా విధించిన పోలీసులు

Hyderabad Traffic Police: హైదరాబాద్‌ (Hyderabad) ట్రాఫిక్‌ పోలీసులు నిబంధనలు కఠినతరం చేశారు. ఇటీవల చోటు చేసుకున్న పలు పరిణామాల నేపథ్యంలో ట్రాఫిక్‌ నిబంధనలను పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే..

Hyderabad Traffic Police: దర్శకుడు త్రివిక్రమ్‌ కారు తనిఖీ.. జరిమానా విధించిన పోలీసులు
Trivikram Srinivas

Updated on: Apr 04, 2022 | 12:30 PM

Hyderabad Traffic Police: హైదరాబాద్‌ (Hyderabad) ట్రాఫిక్‌ పోలీసులు నిబంధనలు కఠినతరం చేశారు. ఇటీవల చోటు చేసుకున్న పలు పరిణామాల నేపథ్యంలో ట్రాఫిక్‌ నిబంధనలను పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే రోడ్లపై తనిఖీలు చేపడతూ ఎక్కడిక్కడా వాహనదారులకు జరిమానా విధిస్తున్నారు. వాహనాలకు వివిధ స్కిక్టర్లను తొలగించడం నుంచి మొదలు, కార్ల అద్దాలకు ఉన్న బ్లాక్‌ ఫిలింలను తొలగిస్తున్నారు. నిబంధనల అమల్లో భాగంగా సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అందరిపై జరిమానాలు విధిస్తున్నారు.

ఇప్పటికే పలువురు సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన వాహనాలపై పోలీసులు జరిమానా విధించిన సంఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కారుకు కూడా పోలీసులు జరిమానా విధించారు. ట్రాఫిక్‌ పోలీసులు రెగ్యులర్‌ డ్యూటీలో భాగంగా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో త్రివిక్రమ్‌ తన కారులో అటుగా వెళుతున్నారు. ఈ సమయంలోనే కారు అద్దాలకు బ్లాక్‌ ఫిలింను గుర్తించిన పోలీసులు వెంటనే ఫిలింను తొలగించారు. అంతేకాకుండా చలాన్‌ విధించారు.

ఇక ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఇప్పటి టాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీల కార్లకు అధికారులు చలాన్లు విధించారు. వీరిలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, కల్యాణ్‌ రామ్, మంచు మనోజ్‌ ఉన్నారు. తాజాగా ఈ జాబితాలోకి త్రివిక్రమ్‌ కూడా చేరారు.

Also Read: Viral Video: షాప్‌లో తండ్రి ఏమీ తినడం లేదని చిన్నారి ఆందోళన.. మీ నాన్న అదృష్టవంతుడు అంటున్న నెటిజన్లు .. వీడియో వైరల్

Mehreen Pirzada: ‘మావి రాత్రి జీవితాలు’ ఆ సంఘటనను గుర్తు చేసుకున్న హీరోయిన్.. సినీ జీవితం అంటేనే అంత..