చూడకుండానే నా సినిమాను ఎలా ఆపమంటారు?: పోసాని

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు, విలక్షణ నటుడు పోసాని కృష్ణమురళి తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన దర్శకత్వం వహించిన “ముఖ్యమంత్రి గారూ.. మీరు మాట ఇచ్చారు” సినిమాను ఆపేయాలంటూ ఎన్నికల సంఘం నుంచి లేఖ వచ్చిందని తెలిపారు. తన సినిమాలో ఎవరినీ తట్టలేదని, సినిమా చూడకుండానే ఎలా ఆపమంటారని పోసాని ప్రశ్నించారు. ఎన్నికల కమిషనర్ మార్కండేయులు తన సినిమా ఆపాలంటూ లేఖ పంపించారని, ఎవరో మోహన్‌రావు అనే వ్యక్తి ఫిర్యాదు చేస్తే తన సినిమాను నిలిపివేయడమేంటని […]

 చూడకుండానే నా సినిమాను ఎలా ఆపమంటారు?: పోసాని

Updated on: Mar 18, 2019 | 1:44 PM

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు, విలక్షణ నటుడు పోసాని కృష్ణమురళి తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన దర్శకత్వం వహించిన “ముఖ్యమంత్రి గారూ.. మీరు మాట ఇచ్చారు” సినిమాను ఆపేయాలంటూ ఎన్నికల సంఘం నుంచి లేఖ వచ్చిందని తెలిపారు. తన సినిమాలో ఎవరినీ తట్టలేదని, సినిమా చూడకుండానే ఎలా ఆపమంటారని పోసాని ప్రశ్నించారు.

ఎన్నికల కమిషనర్ మార్కండేయులు తన సినిమా ఆపాలంటూ లేఖ పంపించారని, ఎవరో మోహన్‌రావు అనే వ్యక్తి ఫిర్యాదు చేస్తే తన సినిమాను నిలిపివేయడమేంటని అడిగారు. అయితే ఈసీకి తానుకూడా మూడు పేజీలతో కూడిన సమాధానాన్ని పంపినట్టు పోసాని తెలిపారు.