
యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం. ఎట్టకేలకు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో ఘనంగా జరుగుతుంది. 98వ ఆస్కార్ అవార్డుల వేడుకకు ప్రముఖ హాలీవుడ్ కమెడియన్ కోనన్ ఓబ్రీయన్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నారు. ఈ వేడుకలో ఒక విన్నర్ కు హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రెజంటర్ గా అవార్డ్ ఇవ్వనున్నారు. ఈ సంవత్సరం ఉత్తమ చిత్రాల రేసులో వాంపైర్ బ్లాక్‌బస్టర్ సిన్నర్స్, డార్క్లీ కామిక్ థ్రిల్లర్ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ వంటి చిత్రాలు గట్టిగానే పోటీపడ్డాయి. కాలిఫోర్నియాను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ముప్పు పొంచి ఉందని ఫెడరల్ హెచ్చరికను అనుసరించి, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మరియు లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌తో సన్నిహితంగా సమన్వయం చేసుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ : కె-పాప్ డెమన్ హంటర్స్
ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ : ది గర్ల్ హూ క్రైడ్ పెర్ల్స్
ఉత్తమ కాస్ట్యూమ్ : కేట్ హాలీ (ఫ్రాంకెన్‌స్టైయిన్ సినిమా)
ఉత్తమ నటుడు : మైఖేల్ బి జోర్డాన్ (సిన్నర్స్ )
ఉత్తమ దర్శకుడు : పాల్ థామస్ ఆండర్సన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)
ఉత్తమ ఒరిజినల్ సాంగ్ : గోల్డెన్ (కెపాప్ డెమన్ హంటర్స్)
ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రం : సెంటిమెంటల్ వాల్యూ
ఉత్తమ సినిమాటోగ్రఫీ : సిన్నర్స్
ఉత్తమ ఎడిటింగ్ : వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
బెస్ట్ సౌండ్ : ఎఫ్1
ఉత్తమ ఒరిజినల్ స్కోర్ : లుడ్విగ్ గోరాన్సన్ (సిన్నర్స్)
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ : మిస్టర్ నోబడీ ఎగైనెస్ట్ పుతిన్
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ : ఆల్ ది ఎంప్టీ రూమ్స్
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ : అవతార్: ఫైర్ అండ్ యాష్
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ : ఫ్రాంకెన్‌స్టైయిన్
ఒరిజినల్ స్క్రీన్‌ప్లే : సిన్నర్స్
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే : వన్ బ్యాటిల్ ఆఫ్ అనదర్
ఉత్తమ సహాయ నటుడు : సీన్ పెన్
ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ : ది సింగర్స్ , టూ పీపుల్ ఎక్స్‌ఛేంజింగ్ సలైవా
ఉత్తమ కాస్టింగ్ : కాసాండ్రా కులుకుండిస్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)
ఉత్తమ మేకప్ : ఫ్రాంకెన్‌స్టైయిన్
ఉత్తమ సహాయ నటి : అమీ మాడిగన్ (వెపన్స్)
ఎక్కువమంది చదివినవి : Actress : మగాళ్ల నుంచి నన్ను నేను కాపాడుకోలేకపోయాను.. టాలీవుడ్ నటి కామెంట్స్ వైరల్..