Avatar 2: విజువల్ వండర్ అవతార్ 2.. అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్స్.. ఒక్కో టికెట్ ధర ఎంతంటే..

|

Nov 23, 2022 | 1:23 PM

అవతార్ 2 సినిమా డిసెంబర్ 15న అర్ధరాత్రి 12 గంటలకే ప్రీమియర్ షో ప్రదర్శించనున్నారు. ఇక ఇప్పుడు దేశవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ బిగ్ టికెట్ మహోత్సవం కోసం అభిమానులు 13 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు.

Avatar 2: విజువల్ వండర్ అవతార్ 2.. అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్స్.. ఒక్కో టికెట్ ధర ఎంతంటే..
Avatar 2
Follow us on

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హాలీవుడ్ విజువల్ వండర్ అవతార్ 2. డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దాదాపు తొమ్మిదేళ్ల సుధీర్ఘ నిరీక్షణ అనంతరం.. ప్రజల ముందుకు రాబోతున్న అవతార్ సీక్వెల్ ఈ మూవీ. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ భారీ స్థాయిలో అంచనాలను పెంచేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని 160కి పైగా భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. కానీ ఈ సినిమా డిసెంబర్ 15న అర్ధరాత్రి 12 గంటలకే ప్రీమియర్ షో ప్రదర్శించనున్నారు. ఇక ఇప్పుడు దేశవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ బిగ్ టికెట్ మహోత్సవం కోసం అభిమానులు 13 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు ఎట్టకేలకు ఈ సైన్స్ ఫిక్షన్ మహోత్సవం కోసం టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.

20వ సెంచరీ స్టూడియోస్ ఇండియా డిసెంబర్ 16, 2022న ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ని ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళంలో విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమాను 3డీ, 4డీఎక్స్ 3డీ ఫార్మాట్ లలో విడుదల చేస్తుండడంతో ఆ స్క్రీన్స్ పై చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో స్క్రీన్ టికెట్స్ ధరలు సినీ ప్రియులకు షాకిస్తున్నారు. ఓ ప్రముఖ టికెట్ బుకింగ్ సైట్ బెంగుళూరులోని ఐమ్యాక్స్ 3 డీ ఫార్మాట్ కిలగిన థియేటర్లో టికెట్ ధర ఏకంగా రూ. 1450 చూపిస్తోంది. అలాగే పుణెలో రూ. 1200 (4డీఎక్స్ 3డీ) , దేశ రాజధాని ఢిల్లీలో రూ. 1000గా ఉంది. ముంబాయిలో రూ. 970.. కోల్ కత్తాలో రూ. 770 గా ఉంది.

ఇక హైదరాబాద్ లో ఒక్కో టికెట్ ధర రూ. 350 (4డీఎక్స్ 3డీ ఫార్మాట్), విశాఖ రూ. 210 (3డీ ఫార్మాట్ ) ఉంది. ఈ ధరలన్నీ సాధారణ సీట్లకు సంబంధించినవే అని తెలుస్తోంది. ఈ సినిమాలో సామ్ వర్దింగ్టన్, జోయా సాల్దానా, సిగుర్నే వీవర్, కేట్ విన్స్ లెట్ కీలకపాత్రలు పోషించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.