Priyanka Chopra: బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకున్న ప్రియాంక చోప్రా హాలీవుడ్ చిత్రాల్లో నటించి గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు. ఈ క్రమంలోనే ప్రముఖ హాలీవుడ్ సింగర్ నికో జోనస్‌ను వివాహం చేసుకొని అమెరికాలో భర్తతో జీవనం కొసాగిస్తోంది ప్రియాంక. ఇదిలా ఉంటే నిత్యం ఏదో ఒక అంశంతో వార్తల్లో ఉండే ప్రియాంక తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పేరు మార్పుతో మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్‌లో తన పేరులో నుంచి భర్త నిక్ పేరును తీసేయడం పెద్ద చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ జంట విడాకులు తీసుకోనుందంటూ వార్తా కథనాలు వచ్చాయి. అయితే దీనిపై ప్రియాంక అప్పట్లోనే అలాంటిదేం లేదని ఖండించారు కూడా.
అయితే పేరు ఎందుకు మార్చారన్న దానిపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేరు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాత్రం పేరు మార్పు వెనకాల ఉన్న అసలు కారణాన్ని చెప్పేశారు ప్రియాంక. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ.. వృత్తిపరమైన కారణాల వల్ల తన భర్త పేరును తొలగించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఒకటి జరిగితే సోషల్ మీడియాలో మరో రకంగా చిత్రీకరిస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. ఇక చాలా మంది సోషల్ మీడియాకి తమ జీవితంలో అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, అది ఏ మాత్రం మంచిది కాదని ప్రియాంక తెలిపారు. ఒక ఫోటోను షేర్ చేస్తే ఏవేవో ఊహించుకుంటున్నారని ఆమె చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా తమ వివాహ బంధంలపై వస్తున్న రుమర్లకు ప్రియాంక ఇలా చెక్ పెట్టేశారన్నమాట.
Also Read: India-Pakistan: మనతో మళ్లీ దోస్తీకి దాయాది దేశం తహతహ.. వందేళ్ల వరకు శత్రుత్వం కోరుకోవడం లేదంటూ..
నీళ్లలో ఎంచక్కా ఎంజాయ్ చేస్తోన్న యువతి !! ఇంతలో ఊహించని ట్విస్ట్ !! వీడియో
RISHI SUNAK: బ్రిటన్ ప్రధానిగా భారతీయ సంతతి వ్యక్తి.. 2022 చివరి నాటికి అద్భుతం జరగడం ఖాయమేనా..?