Arnold Schwarzenegger: నా రాజకీయాలు వారికి అసహ్యంగా అనిపించాయి.. అందుకే నన్ను ద్వేషించారు.. స్టార్ యాక్టర్ ఆవేదన..

|

Jun 22, 2021 | 7:55 AM

సినీ పరిశ్రమకు చెందిన ఎంతోమంది నటీనటులు.. రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇస్తుంటారు. ఇక తమ అభిమాన నటులు గెలవడం కోసం వారి ఫ్యాన్స్ చేసే హడావిడి మాములుగా ఉండదు.

Arnold Schwarzenegger: నా రాజకీయాలు వారికి అసహ్యంగా అనిపించాయి.. అందుకే నన్ను ద్వేషించారు.. స్టార్ యాక్టర్ ఆవేదన..
Arnold Schwarzenegger
Follow us on

సినీ పరిశ్రమకు చెందిన ఎంతోమంది నటీనటులు.. రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇస్తుంటారు. ఇక తమ అభిమాన నటులు గెలవడం కోసం వారి ఫ్యాన్స్ చేసే హడావిడి మాములుగా ఉండదు. అయితే రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి సెలబ్రెటి గెలుస్తాడనే గ్యారెంటీ మాత్రం ఉండదు. కొద్దిలో కొద్ది మంది మాత్రమే అటు సినీ జీవితంలో.. ఇటు రాజకీయ జీవితంలో సక్సెస్ అయినవారు ఉంటారు. అలాంటివారిలో హాలీవుడ్ సీనియర్ హీరో ఆర్నాల్డ్ ష్వాజ్‏నెగ్గర్. అటు స్టార్ హీరోగా ఉన్న ఆర్నాల్డ్.. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో తన సొంత బిడ్డలే తనను అస్యహించుకున్నారని చెప్పారు.

డెబ్భై మూడేళ్ల ఆర్నాల్డ్… ఫ్యాక్స్ న్యూస్ ఛానెల్ కు ఇటీవల ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో ఆర్నాల్డ్ తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ.. నటుడిగా ఉన్న నేను గవర్నర్ గా ఎన్నికయ్యాక నా పిల్లలు సంతోషిస్తారు అనుకున్నాను. కానీ వారు ఆ సమయంలో నన్ను.. నా పదవిని ఎంతో అసహ్యించుకున్నారు. వాళ్లు నా సినిమాలు చూసి పెరిగారు. నాతోపాటు సెట్స్ లోకి వచ్చి సందడి చేశారు. అది వాళ్లకు వినోదం కానీ.. రాజకీయాల సాకుతో వాల్లను హాలీవుడ్ నుంచి షిఫ్ట్ చేయడం వాళ్లకు నచ్చలేదు. అంతేకాదు.. కాలిఫోర్నియాను నేనేం అభివృద్ధి చేయలేదని వాళ్ల అభిప్రాయం. కానీ నా పరిమితులు నాకుంటాయి కదా. అది వాళ్లు అర్థం చేసుకోలేకపోయారు. అందుకే నా రాజకీయాలు వాళ్లకు అసహ్యంగా అనిపించాయి. నన్ను ద్వేషించారు అని ఆర్నాల్డ్ చెప్పారు.

రాజకీయాలు.. సినిమాలు రెండు పడవల మీద ప్రయాణం లాంటివి. ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా..మునిగిపోక తప్పదని రొనాల్డ్ రీగన్ లాంటి స్వఅనుభవం ఉన్నవాళ్లు ఎప్పుడో చెప్పారు. అది నాకు తర్వాతే అర్థమైంది అంటూ చెప్పుకోచ్చాడు ఆర్నా్ల్డ్. 2003 నుంచి 2011 వరకు కాలిఫోర్నియా గవర్నర్ గా పనిచేశాడు ఆర్నాల్డ్. చివరగా.. 2019లో టెర్మినేటర్ డార్క్ ఫేట్ చిత్రంలో కనిపించాడు. ప్రస్తుతం ఆర్నాల్డ్ చేతిలో ఎలాంటి చిత్రాలు లేవు.

Also Read: Thieves Drill Whole Bank: దేశ రాజధాని ఢిల్లీలో భారీ దోపిడీ.. గోడను తవ్వి బ్యాంకుకు కన్నం.. లబోదిబోమంటున్న ఖాతాదారులు!

India Vaccinates : దేశంలో రికార్డు స్థాయిలో కరోనా టీకాల పంపిణీ.. నిన్న ఒక్కరోజులోనే 85 లక్షలకు పైగా ప్రజలకు వ్యాక్సినేషన్