హైకోర్టు తీర్పు ప్రభాస్‌కు ప్లస్సా..? మైనస్సా..?

| Edited By: Ravi Kiran

Apr 24, 2019 | 7:17 PM

టాలీవుడ్ నటుడు ప్రభాస్‌కు సంబంధించిన భూవివాదం కేసులో హైకోర్టులో సంచలన తీర్పును వెల్లడించింది. శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం పర్మక్త గ్రామం వద్ద ఉన్న తన గెస్ట్‌హౌస్‌కు రెవెన్యూ అధికారులు తాళాలు వేయడాన్ని సవాల్ చేస్తూ ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసును మంగళవారం విచారించిన న్యాయస్థానం ఆ స్థలం నుంచి ప్రభాస్‌ను ఖాళీ చేయించడం చట్టవిరుద్ధమని పేర్కొంది. ఈ విషయంలో అధికారుల తీరు సక్రమంగా లేదని వ్యాఖ్యానించింది. అలాగే ప్రభాస్ పెట్టుకున్న క్రమబద్ధీకరణ దరఖాస్తుపై […]

హైకోర్టు తీర్పు ప్రభాస్‌కు ప్లస్సా..? మైనస్సా..?
Follow us on

టాలీవుడ్ నటుడు ప్రభాస్‌కు సంబంధించిన భూవివాదం కేసులో హైకోర్టులో సంచలన తీర్పును వెల్లడించింది. శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం పర్మక్త గ్రామం వద్ద ఉన్న తన గెస్ట్‌హౌస్‌కు రెవెన్యూ అధికారులు తాళాలు వేయడాన్ని సవాల్ చేస్తూ ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసును మంగళవారం విచారించిన న్యాయస్థానం ఆ స్థలం నుంచి ప్రభాస్‌ను ఖాళీ చేయించడం చట్టవిరుద్ధమని పేర్కొంది. ఈ విషయంలో అధికారుల తీరు సక్రమంగా లేదని వ్యాఖ్యానించింది. అలాగే ప్రభాస్ పెట్టుకున్న క్రమబద్ధీకరణ దరఖాస్తుపై ఎనిమిది వారాల్లోగా ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులకు స్పష్టం చేసింది. అధికారులు ఇందుకు తిరస్కరిస్తే ప్రభాస్ తిరిగి కోర్టును ఆశ్రయించవచ్చునని న్యాయమూర్తి పేర్కొన్నారు.

కాగా చట్టంలోని నిబంధనలకు వ్యతిరేకంగా గవర్నమెంట్ అఫీషియల్స్ భూములను స్వాధీనం చేసుకున్నప్పుడు, వాటిని తిరిగి వారికి అప్పగించేలా ఆదేశాలు ఇవ్వొచ్చని.. కానీ 1958 నుంచి ఈ భూముల విషయమై వివాదం నడుస్తోందని.. ప్రస్తుతం తాము దీనిపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని కోర్టు తెలిపింది.