నిర్మాతగా మారుతున్న మాస్ మాహారాజా.. కొత్త బ్యానర్‌ను రిజిస్టర్ చేయిస్తున్న రవితేజ.. పేరేంటో తెలుసా..

|

Feb 17, 2021 | 3:21 PM

అసిస్టెంట్ డైరెక్టర్‏గా కెరీర్ ప్రారంభించి.. తర్వాత హీరోగా దూసుకుపోతున్న వారిలో రవితేజ ఒకరు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా.. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి..

నిర్మాతగా మారుతున్న మాస్ మాహారాజా.. కొత్త బ్యానర్‌ను రిజిస్టర్ చేయిస్తున్న రవితేజ.. పేరేంటో తెలుసా..
Follow us on

Actor Raviteja: అసిస్టెంట్ డైరెక్టర్‏గా కెరీర్ ప్రారంభించి.. తర్వాత హీరోగా దూసుకుపోతున్న వారిలో రవితేజ ఒకరు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా.. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. చిన్న పాత్రల్లో చేసుకుంటూ వచ్చిన రవితేజ.. మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా సరైన హిట్ లేకుండా డీలా పడిన మాస్ మహారాజా కెరీర్.. ఇటీవల విడుదలైన క్రాక్ సినిమాతో మళ్ళీ ఫాంలోకి వచ్చాడు. ఇక అదే జోరుతో.. ఆయన వరుస సినిమాలను లైన్లో పెట్టేస్తున్నారు. ప్రస్తుతం రవితేజ ‘ఖిలాడీ’ మూవీ షూటింగ్‏లో పాల్గొంటున్నారు. తాజాగా ఈ హీరోకి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ విషయం ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.

అటు హీరోగానే కాకుండా.. రవితేజ ప్రొడక్షన్ రంగంలోకి కూడా అడుగుపెడుతున్నాడట. కొత్త టాలెంట్‏ను వెలికి తీయడంతోపాటు చిన్న సినిమాలను ప్రోత్సహించేందుకు రవితేజ సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించనున్నాడట. ఇప్పటికే ఆర్‏టీ పేరుమీద రవితేజ బ్యానర్ రిజిస్టర్ చేయించినట్లుగా సమాచారం. అయితే ఈ విషయం గురించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న ‘ఖిలాడీ’ చిత్రానికి రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా.. మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ ప్రతినాయకుడుగా నటిస్తున్నాడు. ఈ మూవీ మే 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read:

Hero NTR : రోడ్డు ప్రమాదంలో నా అన్న, తండ్రిని కోల్పోయాను.. ఆవేదన వ్యక్తం చేసిన నందమూరి స్టార్ హీరో..