Hero Ram pothineni: లవర్ బాయ్ లుక్‏లో హీరో రామ్.. ఆమ్లెట్ వేస్తూ ఫోజులిచ్చిన ఎనర్జిటిక్ స్టార్..

|

Jan 08, 2021 | 9:00 PM

ఇస్మార్ట్ శంకర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో మరోసారి తన ఫాంలోకి వచ్చాడు హీరో రామ్ పోతినేని. తాజా 'రెడ్' సినిమాలో నటిస్తున్న రామ్..

Hero Ram pothineni: లవర్ బాయ్ లుక్‏లో హీరో రామ్.. ఆమ్లెట్ వేస్తూ ఫోజులిచ్చిన ఎనర్జిటిక్ స్టార్..
Follow us on

Hero Ram pothineni: ఇస్మార్ట్ శంకర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో మరోసారి తన ఫాంలోకి వచ్చాడు హీరో రామ్ పోతినేని. తాజా ‘రెడ్’ సినిమాలో నటిస్తున్న రామ్.. త్వరలో మరో క్రేజీ ప్రాజెక్టుతో రానున్నట్లు తెలుస్తోంది. ఇక రామ్ నటించిన రెడ్ మూవీ సంక్రాంతి కానుకగా థియేటర్లలో రానుంది. తాజాగా రామ్‏కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‏గా మారాయి.

రెడ్ సినిమా కోసం ఇటీవల గడ్డం పెంచేసి.. ఎప్పుడు సీరియస్‏గా కనిపించిన రామ్.. తాజా ఫోటోల్లో క్యూట్ లవర్ బాయ్‏గా దర్శనం ఇచ్చాడు. అందులో రామ్ పీజ్ కలర్ టీ షర్ట్, తెల్లటి ప్యాంట్ ధరించి.. ఆమ్లెట్ వేస్తు ఫోటోలకు ఫోజులిచ్చాడు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వాటిని చూసిన రామ్ ఫ్యాన్స్ ‘ఆమ్లెట్ వేస్తున్నా.. ఆపిల్ పండులా’ ఉన్నాడు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రామ్ నటించిన రెడ్ మూవీ మొత్తం ఏడు భాషల్లో విడుదల కానుంది.

Also Read: RED Movie Trailer : ఎంజాయ్‌‌‌‌‌మెంట్-ఎంజాయ్‌‌‌మెంటే.. సేఫ్టీ-సేఫ్టీనే.. రెడ్ ట్రైలర్ లాంచ్‌లో హీరో రామ్