Re Release: ఇది కదా అసలైన రీ రిలీజ్‌ అంటే.. ఆ రోజులు గుర్తు చేసుకోవడానికి రడీ అవ్వండి

అందుకే నిర్మాణ సంస్థలు సైతం సినిమాలను రీరిలీజ్‌ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఇలా ఎన్నో అపురూప చిత్రాలు వెండి తెరపై మళ్లీ తళుక్కుమన్నాయి. ఈ జాబితాలోకి ఇప్పుడు మరో క్లాసిక్‌ కల్ట్‌ మూవీ వచ్చి చేరుతోంది. అదే హ్యాపీడేస్‌. ఈ సినిమా గురించి యూత్‌కు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద....

Re Release: ఇది కదా అసలైన రీ రిలీజ్‌ అంటే.. ఆ రోజులు గుర్తు చేసుకోవడానికి రడీ అవ్వండి
Happy Days Movie

Updated on: Sep 18, 2023 | 9:49 AM

ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు ప్రేక్షకుల మనసుదోచిన చిత్రాలు ఇప్పుడు మళ్లీ వెండి తెరపై కనువిందు చేస్తున్నాయి. రీ రలీజ్‌ పేరుతో మరోసారి ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి. హీరోల పుట్టిన రోజులు, సిల్వర్‌ జూబ్లీ వేడుకలు ఇలా సందర్భం ఏదైనా పాత సినిమాలు మళ్లీ విడుదలవుతున్నాయి. రీ రిలీజ్‌ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి కూడా ఆదరణ పెరుగుతోంది. ఈ చిత్రాలకే వస్తోన్న కలెక్షన్లే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు.

అందుకే నిర్మాణ సంస్థలు సైతం సినిమాలను రీరిలీజ్‌ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఇలా ఎన్నో అపురూప చిత్రాలు వెండి తెరపై మళ్లీ తళుక్కుమన్నాయి. ఈ జాబితాలోకి ఇప్పుడు మరో క్లాసిక్‌ కల్ట్‌ మూవీ వచ్చి చేరుతోంది. అదే హ్యాపీడేస్‌. ఈ సినిమా గురించి యూత్‌కు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2007లో వచ్చిన ఈ సినిమా కుర్రకారును ఊపేసింది. కాలేజీ స్టూడెంట్స్‌ థియేటర్లకు క్యూ కట్టారు. గ్యాంగ్‌లు గ్యాంగ్‌లుగా థియేటర్లలో రచ్చ రచ్చ చేశారు.

ఈ సినిమా విడుదలై ఇన్నేళ్లు అవుతోన్న ఇప్పటికే టీవీలో వస్తే అతుక్కుపోతారనడంలో ఎలాంటి సందేహం లేదు. కాలానికి అతీతంగా ఈ సినిమా స్టూడెంట్స్‌కు కనెక్ట్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థుల మధ్య జరిగే గొడవలు, స్నేహాలు, ప్రేమలు.. ఇలా జీవితంలోని ఒక భాగాన్ని శేఖర్‌ కమ్ముల అద్భుత దృశ్యకావ్యంగా తెరకెక్కించి ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్‌ అయ్యాడు.

హీరో నిఖిల్‌ ట్వీట్‌..

ఇదిలా ఉంటే ఇప్పుడీ చిత్రాన్ని మళ్లీ రీ రిలీజ్‌ చేయనున్నారా.? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా హీరో నిఖిల్‌ పోస్ట్ చేసిన ఓ ట్వీట్ ఈ వార్తలకు బలాన్ని చేకూర్చినట్లైంది. నిఖిల్‌ సిద్ధార్థ హ్యాపీడేస్‌ చిత్రం ద్వారానే వెండి తెరకు పరిచయమైన విషయం తెలిసిందే. తాజాగా నిఖిల్ ట్వీట్ చేస్తూ.. ‘హ్యాపీడేస్‌ సినిమా రీ రిలీజ్‌ ఒకేనా.?’ అంటూ ఓ ట్వీట్ చేశాడు. ఇంకేముంది లైక్‌లు, కామెంట్స్‌ వర్షం కురుస్తోంది. ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నామని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. మరి హ్యాపీ డేస్‌ మళ్లీ వెండి తెరపై ఎప్పుడు వస్తుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..